అల్లు అర్జున్ సినిమాకు బాలీవుడ్లో సీక్వెల్ రావడం ఏంటి.. అయినా మన హీరో తెలుగులోనే బిజీగా ఉన్నాడు కదా అనుకుంటున్నారా..? కొన్నిసార్లు అంతే.. మన దగ్గర్నుంచి కథలు తీసుకుని మనకు తెలియకుండా బాలీవుడ్లో సీక్వెల్స్ చేస్తుంటారు.
2/ 9
ఉదాహరణకు సింగం సినిమా ఉంది.. అజయ్ దేవ్గన్ ఫస్ట్ పార్ట్ మాత్రమే తీసుకుని సింగం 2 సొంతంగా చేసుకున్నారు. అచ్చంగా అదే ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాకు కూడా అప్లై అవుతుంది.
3/ 9
అర్థం కాలేదు కదా.. ఏం లేదు లెక్క చాలా సింపుల్.. 12 ఏళ్ళ కింద తెలుగులో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన పరుగు సినిమా గుర్తుంది కదా.. ఎమోషనల్ ఎంటర్టైనర్గా వచ్చిన ఆ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది.
4/ 9
ఇదే సినిమాను బాలీవుడ్లో హీరో పంతి పేరుతో రీమేక్ చేసారు. ఈ సినిమాతోనే టైగర్ ష్రాఫ్ హీరోగా పరిచయం అయ్యాడు. అక్కడ కూడా ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఇందులో కృతి సనన్ హీరోయిన్గా నటించింది.
5/ 9
పరుగు కథను ఉన్నదున్నట్లు దించేసి.. దానికి యాక్షన్ సీక్వెన్సులు పెట్టుకున్నాడు టైగర్ ష్రాఫ్. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నారు దర్శక నిర్మాతలు.
6/ 9
టైగర్ ష్రాఫ్ కూడా దీనికి ఓకే చెప్పేసాడు. ఇప్పటికే తెలుగులో వచ్చిన వర్షం, క్షణం, తడాఖా లాంటి సినిమాలను హిందీలో రీమేక్ చేసాడు టైగర్ ష్రాఫ్. ఇప్పుడు పరుగు సీక్వెల్ చేస్తున్నారు అక్కడ.
7/ 9
దర్శకుడు షబ్బీర్ ఖాన్ ఈ సినిమాకు సీక్వెల్ కథ సిద్ధం చేసే పనుల్లో బిజీ అయిపోయాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ అతిథి పాత్ర చేస్తే బాగుంటుందని అడిగినట్లు కూడా తెలుస్తుంది.
8/ 9
నిర్మాత సాజిద్ ఖాన్ కూడా ఇదే విషయం బన్నీని నేరుగా అడిగినట్లు ప్రచారం జరుగుతుంది.
9/ 9
మరోవైపు తెలుగులో కూడా ఈ సినిమాకు సీక్వెల్ చేస్తే బాగుంటుందనే ఆలోచన దిల్ రాజు బుర్రలో మెదులుతుంది. అప్పట్లో ఈ సీక్వెల్ గురించి చెప్పాడు దిల్ రాజు. మొత్తానికి తెలుగు కంటే ముందు హిందీలోనే ఈ సీక్వెల్ వచ్చేలా కనిపిస్తుంది.