చిత్రంలో బన్నీ నటన, స్వాగ్, డైలాగ్స్, డ్యాన్స్ బీటౌన్ ఆడియన్స్ మెప్పుపొందాయి. అయితే ఈ సినిమాకు సీక్వల్ ఉండబోతుందని ముందే ప్రకటించిన డైరెక్టర్ సుకుమార్.. ప్రస్తుతం ఆ పనులతో బిజీగా ఉన్నారు. పుష్ప 2 పేరుతో ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకొచ్చారు. దీంతో ఈ మూవీకి సంబంధించి ఏ చిన్న అప్ డేట్ వచ్చినా నెట్టింట వైరల్ అవుతోంది.
భారీ రేంజ్ లో రూపొందుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. అతిత్వరలో ఈ మూవీ షూటింగ్ కోసం బ్యాంకాక్ వెళ్లనున్న యూనిట్.. అక్కడ రెండు షెడ్యూల్స్ ప్లాన్ చేశారట. ఆ వెంటనే మారేడుమిల్లి అడవుల్లో మేజర్ పార్ట్ షూటింగ్ చేయనున్నారట. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమా రిలీజ్ చేయాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నారట.