ఎన్టీఆర్,అల్లు అర్జున్ రూట్లో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు .. అవును ఇపుడు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు కూడా ఎన్టీఆర్, అల్లు అర్జున్ రూట్లో ప్యాన్ ఇండియా మూవీస్‌తో పలకరించబోతున్నారు. (Twitter/Photos)
2/ 11
ప్యాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ మూవీతో ఎన్టీఆర్ బాలీవుడ్లో అడుగుపెట్టబోతున్నారు. ఈ చిత్రంలో తారక్.. కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 7వ తేదిన విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. (Twitter/Photo)
3/ 11
ఈ యేడాదే అల్లు అర్జున్.. బాలీవుడ్లో ‘ఫుష్ప’ సినిమాతో డైరెక్ట్ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17వ తేదిన విడుదల కానుంది. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్గా నటించింది. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. (Twitter/Photo)
4/ 11
’లైగర్’ మూవీతో విజయ్ దేవరకొండ తొలిసారి హిందీ చిత్రసీమలో అడుగుపెట్టబోతున్నాడు. హీరోగా విజయ్ దేవరకొండ తొలి పాన్ ఇండియా చిత్రం. ఈ సినిమా ఫస్ట్ లుక్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలో ఈ సినిమా విడుదల తేదిని ప్రకటించనున్నారు. (Instagram/Photo)
5/ 11
సిద్ధార్ధ్ మల్హోత్ర హీరోగా నటిస్తోన్న ‘మిషన్ మజ్ను’ సినిమాతో బాలీవుడ్లో లక్ పరీక్షించుకోబోతున్న రష్మిక మందన్న. ఈ సినిమాతో పాటు పుష్పతో రష్మిక .. బాలీవుడ్లో పాగా వేయడం పక్కా అని చెప్పొచ్చు. అంతకు ముందే ‘పుష్ప’తో ప్యాన్ ఇండియా ప్రేక్షకులను పలకరించబోతుంది. (Twitter/Photo)
6/ 11
అటు పవన్ కళ్యాన్ కూడా ‘హరి హర వీరమల్లు’ సినిమాను ప్యాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేస్తున్నారు. వచ్చే యేడాది ఏప్రిల్ 29న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. (Twitter/Photo)
7/ 11
సర్కారు వారి పాట సినిమాను కూడా ప్యాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్న మహేష్ బాబు.ఈ సినిమాను జనవరి 13న సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ ఈ సినిమా సమ్మర్‌కు పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. (Sarkaru Vaari paata)
8/ 11
రాజమౌళి దర్శకత్వంలో ఫ్రభాస్ హీరోగా నటించిన ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌తో బాలీవుడ్ డెబ్యూ ఇస్తున్న హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఇదే సినిమాతో దర్శకుడిగా వినాయక్.. బాలీవుడ్ గడప తొక్కబోతున్నారు. Photo : Twitter
9/ 11
మరోవైపు మెగా బ్రదర్ నాగబాబు... బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌తో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నట్టు సమాచారం. దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. (Twitter/Photo)
10/ 11
నాని హీరోగా నటించిన ‘జెర్సీ’ హిందీ మూవీ రీమేక్‌తో హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్న దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. ఈ సినిమా ఈ ఇయర్ ఎండ్ డిసెంబర్ 31న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. (Twitter/Photo)
11/ 11
జెర్సీ హిందీ రీమేక్‌తో నిర్మాతగా బాలీవుడ్లో సత్తా చాటబోతున్న నిర్మాత దిల్ రాజు. దీంతో పాటు పలు బాలీవుడ్ చిత్రాలను లైన్లో పెట్టారు. ఈ సినిమాలతో బాలీవుడ్లో సత్తా చాటాలని చూస్తున్నారు. Star Producer Dil Raju)