ఈ సందర్భంగా అల్లు అర్జున్ తన సామాజిక మాధ్యమాల్లో ఆ విషయాన్ని పంచుకున్నారు. హీరోగా అల్లు అర్జున ఫస్ట్ మూవీ ‘గంగోత్రి’. కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కని ఈ సినిమాను అల్లు అరవింద్, అశ్వనీదత్ కలిసి నిర్మించారు. ఈ సినిమా ఓ మోస్తరు విజయం సాధించింది. అంతకు ముందు కొన్ని సినిమాల్లో బాల నటుడిగా నటించారు. ఇక చిరు ‘డాడీ’లో కూడా నటించడం విశేషం. హీరోగా మాత్రం ‘గంగోత్రి’ మొదటి సినిమా.
చేసినవి కొన్ని చిత్రాలైనా తనదైన నటన డాన్స్, ఫైట్స్ .. లతో టాలీవుడ్లో నయా ట్రెండ్ క్రియేట్ చేసాడు అల్లు అర్జున్. కేవలం తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాదు.. కేరళ చలన చిత్ర పరిశ్రమలో తనదైన స్టైలిష్ నటనతో అభిమానులను సంపాదించుకొన్న దేశముదురు. తెలుగులో తన సిక్స్ ప్యాక్ తో యూత్ ని అలరించిన స్టైలిష్ స్టార్. గతేడాది ’పుష్ప’తో ఐకాన్ స్టార్‌గా తనను తాను మలుచుకొని ప్యాన్ ఇండియా స్టార్‌గా సత్తా చూపెడుతున్నారు. (Twittter/Photo)
అల్లు రామలింగయ్య మనవడిగా నిర్మాత అల్లు అరవింద్ తనయుడిగా అల్లు అర్జున్ తెరంగేట్రం బాగానే జరిగింది. అటు మెగా నట వారుసుడు హీరోగా టాలీవుడ్లో అడుగుపెట్టిన అల్లు అర్జున్..1983 ఏప్రిల్ 8న మద్రాసులో అల్లు అరవింద్, నిర్మల దంపతులకు రెండో కుమారుడు. చిన్నప్పుడే ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో మామ చిరంజీవి నటించిన ‘విజేత’ చిత్రంలో బాలనటుడిగా మెరిసాడు. అటు స్వాతిముత్యంలో కూడా నటించాడు ఈ ఐకాన్ స్టార్. (twitter/Photo)
ఆ తర్వాత చిరంజీవి యాక్ట్ చేసిన ‘డాడీ’ చిత్రంతో చిన్నరోల్ లో కనిపించి మురిపించాడు. ఆ తర్వాత దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు డైరెక్షన్ లో వచ్చిన గంగోత్రితో హీరోగా ప్రమోషన్ పొందాడు. అంతేకాదు టాలీవుడ్లో హీరోగా 20 యేళ్లు కంప్లీట్ చేసుకున్నాడు. 20 యేళ్ల కెరీర్లో 20 సినిమాలు చేసాడు. యావరేజ్‌గా యేడాదికి ఒకటి చొప్పున సినిమాలు చేసాడు.
హీరోగా గంగోత్రి మూవీతో ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే సక్సెస్ అందుకున్నాడు. ముఖ్యంగా ఆర్య మూవీ కేరళలోని చాలా థియేటర్లలో 100 రోజులు ఆడింది. బన్ని వచ్చినపుడు ఎవరీ కుర్రాడు ఇలా ఉన్నాడు..? బ్యాగ్రౌండ్ ఉంటే ఎలా ఉన్నా హీరో అయిపోవచ్చా..? ప్రేక్షకుల ముందుకు తోసేసి.. వాళ్లపైకి రుద్దేస్తారా.. అంటూ చాలా విమర్శలు వచ్చాయి. బహుశా తెలుగులో ఏ వారసుడిపై కూడా ఈ స్థాయి విమర్శలు రాలేదు. కానీ అల్లు అర్జున్‌పై వచ్చాయి. గంగోత్రి విడుదలైనపుడు చాలా మంది తిట్టారు కూడా. కానీ అప్పుడు తిట్టిన నోళ్లే ఇప్పుడు ఆ హీరోను చూసి వావ్ అంటున్నాయి.
తండ్రి టాలీవుడ్‌ను శాసిస్తున్న టాప్ ప్రొడ్యూసర్. మామ చిరు మెగాస్టార్ గా ప్రేక్షక నీరాజనాలందుకున్న నటుడు. అల్లు రామలింగయ్య గురించైతే చెప్పక్కర్లేదు. తనదైన హాస్యంతో తెలుగు తెరను ‘అల్లు’కుపోయిన గొప్ప నటుడు. ఇంత పెద్ద సపోర్టు ఉన్నా.. దాన్ని ఎంట్రీ వరకే వాడుకుని తాను పోషించే పాత్రలకు వందకు వంద శాతం న్యాయం చేస్తూ దూసుకుపోతున్నాడు.
హీరోగా తొలి సినిమా ‘గంగోత్రి’ నుంచి ‘పుష్ప’ చేసే ప్రతి చిత్రంలో వైవిధ్యాన్ని ఆవిష్కరించాడు. ఇక తన డబ్బింగ్ సినిమాలతో కేరళతో పాటు నార్త్ ఆడియన్స్‌ను అట్రాక్ట్ చేసిన అల్లు అర్జున్...గతేడాది సుకుమార్ దర్శకత్వంలో చేసిన ‘పుష్ప’ మూవీతో ప్యాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ కాలేదు కానీ.. మిగతా రాష్ట్రాల్లో ముఖ్యంగా హిందీలో రూ. 100 కోట్ల షేర్ (రూ. 353 కోట్ల గ్రాస్) వసూళ్లను సాధించి ఔరా అనిపించింది. (Twitter/Photo)