అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో ‘పుష్ప’ (Pushpa) అనే ప్యాన్ ఇండియా సినిమా 2021 డిసెంబర్ 17న విడుదలై మంచి ఆదరణ పొందింది. రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్గా చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. కాగా ఈసినిమాకు రెండో భాగం వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే పూజా కార్యక్రమాలు జరిగాయి. Photo : Twitter
పుష్ప 2 షూటింగ్ జనవరి రెండవ వారం నుండి ప్రారంభం కానుంది. అంతేకాదు బ్యాంకాక్‌లో భారీగా వేసిన సెట్స్‌లో అల్లు అర్జున్ జాయిన్ అవుతాడట. అక్కడే దాదాపు ఓ 30 రోజుల పాటు షూటింగ్ జరుగునుందని టాక్.. ఈ ముప్పై రోజుల్లో దాదాపు 40% షూటింగ్ కంప్లీట్ కానుందని.. బ్యాంకాక్‌లోని అక్కడి దట్టమైన అడవుల్లో ప్లాన్ చేశారట టీమ్ . Photo : Twitter
పుష్ప సినిమా విడుదలై ఏడాది కావోస్తున్న ఆ సినిమా గురించి ఇంకా వార్తలు వస్తూనే ఉన్నాయి. పుష్ప ఫీవర్ ఎక్కడా తగ్గడం లేదు. విదేశాల్లో కూడా ఇదే టాపిక్‌గా నడుస్తుంది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రేక్షకులు మరియు విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుంది. ఈ టాలీవుడ్ సినిమా తెలుగులోనే కాకుండా హిందీలో కూడా భారీ వసూళ్లను రాబట్టింది.
ఇక మరోవైపు ‘పుష్ప 2’ సినిమాలో మరో కీలక పాత్ర ఉంటుందని తెలుస్తోంది. ఆ పాత్రలో హీరోయిన్ కేథరీన్ థెరీసా నటించనుందని టాక్. ఈ సినిమాలో ఆమె నెగిటివ్ పాత్రలో కనిపించనుందని అంటున్నారు. ఇక మరో కీలకపాత్రలో అంటే ఫహద్ ఫాజిల్ పాత్రలో మనోజ్ బాజ్ పాయ్ నటించనున్నారని టాక్ నడుస్తోంది. ఆయన ఈ సినిమాలో పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నారని అంటున్నారు. Photo : Twitter
ప్రతిష్టాత్మకంగా వస్తున్న ‘పుష్ప 2 లో ఓ అదిరిపోయే ఫైట్ ఉండనుందట. ఇంటర్వెల్ బ్లాక్‌లో వచ్చే సీక్వెన్స్‌లో అల్లు అర్జున్ తన ఫ్రెండ్‌ను కాపాడే క్రమంలో సింహంతో ఫైట్ చేయాల్సి ఉంటుందట. ఈ సింహంతో పోరాడే సీన్‌ను ఓ రేంజ్లో డిజైన్ చేశారట సుకుమార్. చెప్పాలంటే ఆర్ ఆర్ ఆర్‌లో ఎన్టీఆర్ పులి సీన్ కంటే మించి ఉంటుందట. ఈ ఒక్క సీన్‌ను షూట్ చేసేందుకు టీమ్ థాయ్‌ల్యాండ్ వెళ్లనుందని తెలుస్తోంది. Photo : Twitter