అల్లు అర్జున్-రష్మిక మందన్న నటించిన పుష్ప: ది రూల్ టాలీవుడ్ నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటి. పుష్ప: ది రైజ్ యాజ్ ఎ పాన్ ఇండియా సక్సెస్ సీక్వెల్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానుల అంచనాలను పెంచింది. క్లైమాక్స్ క్లిఫ్ హ్యాంగర్‌లో విరోధిగా ఫర్హాద్ ఫాసిల్ చూపిస్తూ ఆ హైప్‌ని మరింత పెంచింది.
పుష్ప క్రేజ్ ఖండాంతరాలకు పాకింది. ఇక పుష్ప 2 కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ మూవీ షూటింగ్ ఆగష్టు నుంచి ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. పుష్ప 2 ఆగష్టులో లాంచ్ అయితే విడుదల వేసవిలోనే ఉంటుందని అంటున్నారు. కనుక 2023 వేసవిలో ఈ మూవీ రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది.
అయితే పుష్ప 2 గురించి తాజాగా ఓ క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ మూవీకి గాను రూ.350 కోట్లను బడ్జెట్‌గా ఫిక్స్ చేశారట. అలాగే ఇందులో నటీనటలుకు ఇవ్వనున్న మొత్తం గురించి కూడా వార్తలు వస్తున్నాయి.పుష్ప 2కు గాను సుకుమార్, అల్లు అర్జున్, ఇతర నటీనటులకు కూడా భారీగానే రెమ్యునరేషన్‌ను అందించనున్నారని తెలుస్తోంది.
రష్మిక మందన, Rashmika Mandanna, Fahadh Faasil,పుష్ప మూవీ" width="1600" height="1600" /> అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఆగస్ట్ మూడో వారం నుంచి 'పుష్ప ది రూల్' సినిమా సెట్స్ మీదకు వెళ్ళే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈసారి ఎలాంటి ఆలస్యమూ వుండదన్నది చిత్ర యూనిట్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.
పుష్పలో అల్లు అర్జున్ మేనరిజం, తగ్గేదేలే అంటూ అతడు యాసలో చెప్పిన డైలాగులు ఫ్యాన్స్‌ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఎర్రచందనం స్మగ్లింగ్ ప్రధాన కథాంశంగా తెరకెక్కిన పుష్ప సినిమా సీక్వెల్ కూడా ఉంటుందని గతంలోనే సుకుమార్ చెప్పాడు. పుష్ప రిలీజ్ అయి ఇప్పటికే 7 నెలలు కావస్తోంది. అయినప్పటికీ ఈ మూవీకి ఇంకా క్రేజ్ తగ్గలేదు.