Allu Ayan - Allu Arha: టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ ఫ్యామిలీ అభిమానులకు ఎంత దగ్గరగా ఉంటుందో చేస్తూనే ఉంటాం. ఇక తన భార్య స్నేహ రెడ్డి సోషల్ మీడియా వేదికగా నిత్యం తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. అంతే కాకుండా తాజాగా పాన్ ఇండియా స్థాయిలో తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో విపరీతమైన ఫాలోయింగ్ పెంచుకొని సెలబ్రిటీ గా మారింది. ఇదిలా ఉంటే తాజాగా తన ఇన్ స్టా వేదికగా ఓ ఫోటో షేర్ చేసుకోగా అందులో తన కొడుకు అయాన్, కూతురు అర్హ ఉన్నారు. అందులో అయాన్ తన చెల్లిని భుజాన ఎత్తుకొని తిప్పుతున్నాడు. ఇక ఈ ఫోటోను చూసిన నెటి జనులు ఆ అన్నాచెల్లెళ్ల మధ్య ఉన్న అనుబంధాన్ని తెగ పొగుడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది.