తాను, చిరంజీవి చాలా మంచి స్నేహితులమని చెప్పిన అల్లు అరవింద్.. అదే స్నేహంతో బావ బావమరుదులుగా జీవితంలో పైకి వచ్చామని అన్నారు. అలా మేము పైకి వస్తున్న క్రమంలో పిల్లలు పుట్టి వాళ్ళు కూడా ఎదిగారు. అలాగే అందరూ ఇదే వృత్తిలో కొనసాగుతున్నారు. ఈ చిన్న ఫిలిం సొసైటీలో వీళ్లంతా అవకాశాలు పంచుకోవాలంటే పోటీతత్వం అనేది తప్పదని అల్లు అరవింద్ అన్నారు.