అల్లు అరవింద్ పెద్ద కుమారుడు పేరు వెంకటేష్. మెగా నిర్మాత అరవింద్ పెద్ద తనయుడిగా బాబీ ఇండస్ట్రీలో అందరికీ సుపరిచితమే. అయితే ఆయన గురించి ఇక్కడ కొన్ని విషయాలు అందరికీ చెప్పాలి. కొండంత బ్యాక్ గ్రౌండ్ ఉన్న అల్లు బాబి.. తనకంటూ సొంత గుర్తింపు కోసం ఇప్పటికే ఎన్నో సాధించారు. ఐటీ మీడియా రంగంలో ఎన్నో అద్భుతాలను సృష్టించారు అల్లు వెంకటేష్.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంతో పాటు సినిమా రంగంలోనూ గత 15 ఏళ్లుగా ఎన్నో విజయాలు అందుకుని తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు అల్లు వెంకటేష్. ఇక ఇప్పుడు నిర్మాతగా గని సినిమాతో తెర ముందుకు వచ్చారు. మరి టెక్నికల్ రంగంలో అద్భుతాలు చేసిన బాబీ.. సినిమా నిర్మాణ రంగంలో ముందు ముందు ఎలాంటి మాయ చేస్తాడో చూడాలి. మొత్తంగా తమ్ముళ్లిద్దరు తెర ముందు అలరిస్తూ ఉంటే.. ఈయన మాత్రం తెరక వెనక అద్శుతమైన పత్ర పోషిస్తున్నారు. (File/Photo)