Home » photogallery » movies »

ALLARI NARESH TO GOPICHAND VIJAY AADHI PINISETTY MANY TAMIL TELUGU HEROES TOLLYWOOD AND KOLLYWOOD DIRECTOR SONS WHO TURNED AS HEROES TA

Allari Naresh - Vijay - Gopichand: అల్లరి నరేష్, గోపీచంద్, విజయ్ సహా ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోలుగా సత్తా చూపిస్తున్న దర్శకుల వారసులు వీళ్ళే..

Allari Naresh - Gopichand - Vijay : సాధారణంగా ఇండస్ట్రీలో హీరోల కొడుకులు కచ్చితంగా హీరోలు అవుతుంటారు. ఏ ఒక్కరో ఇద్దరో నటన కాకుండా మరో ప్రొఫెషన్ ఎంచుకుంటారు కానీ దాదాపు 99 శాతం మంది మాత్రం నటన తప్ప మరో ఆప్షన్ తీసుకోరు. కానీ వీళ్లు మాత్రం దర్శకుల వారసులుగా ఎంట్రీ ఇచ్చి అదరగొట్టారు. ఇక సినీ ఇండస్ట్రీలో హీరోల తనయులే కాదు.. దర్శకుల కుమారులు కూడా హీరోలుగా సత్తా చాటారు. అలా దర్శకుల కుమారుల్లో ముందుగా చెప్పుకోవాల్సింది తమిళ స్టార్ హీరో విజయ్. ఇక తెలుగులో సత్తా చాటుతున్న అల్లరి నరేష్, గోపీచంద్ కూడా దర్శకుల తనయులే కదా. వీళ్లలా హీరోలుగా పరిచయమైన డైరెక్టర్స్ తనయులు ఇంకెవరున్నారంటే..