Sharmila Mandre: కరోనా ఇప్పుడు అందర్నీ వెంటాడుతుంది. చిన్నాపెద్దా తేడా లేకుండా అటాక్ చేస్తుంది. తాజాగా ప్రముఖ కన్నడ నటి షర్మిలా మండ్రేకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది.
కరోనా ఇప్పుడు అందర్నీ వెంటాడుతుంది. చిన్నాపెద్దా తేడా లేకుండా అటాక్ చేస్తుంది. తాజాగా ప్రముఖ కన్నడ నటి షర్మిలా మండ్రేకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది.
2/ 6
ఆమెకు మాత్రమే కాదు.. ఆమె కుటుంబ సభ్యులకు కూడా కరోనా వచ్చిందని ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అంతా హోం క్వారంటైన్లో ఉన్నామని.. వైద్యుల సూచనలు.. సలహాలు పాటిస్తూ చికిత్స తీసుకుంటున్నామని తెలిపింది షర్మిల.
3/ 6
ఈమె తెలుగులో కూడా నటించింది. అల్లరి నరేష్ హీరోగా వచ్చిన 'కెవ్వుకేక' సినిమాలో నటించింది షర్మిల. లాక్ డౌన్లో కూడా ఈమె పేరు బాగానే వినిపించింది.
4/ 6
దానికి కారణం ఈమె ఈ నిబంధనలు ఉల్లంఘించి బహిరంగ ప్రదేశాల్లో తన స్నేహితులతో కలిసి తిరిగింది. ఆ మధ్య ఈమెకు యాక్సిడెంట్ కూడా అయింది.
5/ 6
ఇక కన్నడ ఇండస్ట్రీని కలవరపెడుతున్న డ్రగ్స్ కేసులో కూడా షర్మిల పేరు వినిపిస్తుంది. దీనిపై ఈమె మాట్లాడుతూ రేటింగ్స్ కోసం కొన్ని చెత్త టీవీ ఛానళ్లు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆమె మండి పడింది.
6/ 6
తనకు ఎలాంటి సంబంధం లేదని.. ప్రస్తుతం కుటుంబంతో పాటు గడుపుతున్నానని చెప్పుకొచ్చింది షర్మిల మండ్రే. స్వయంకృషితో తాను ఈ స్థాయికి ఎదిగానని.. అనవసరంగా ఉన్నవి లేనివి చెప్పి తన కెరీర్ పాడు చేయొద్దని కోరుతుంది షర్మిల మండ్రే.