నరేష్‌కు 2021లో ‘నాంది’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. చివరగా ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ సినిమాతో పలకరించారు. ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న అందకు తగ్టట్టు కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. ఇప్పటికే ఈ సినిమా జీ 5 ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. అక్కడ ఈ సినిమా ఓ మోస్తరు రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమా జీ టీవీలో ప్రసారమైతే.. 3.5 టీఆర్పీ రేటింగ్ సాధించింది. కామన్ ఆడియన్స్‌కు ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. (Twitter/Photo)
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం మొత్తం బాక్సాఫీస్ కలెక్షన్స్ విషయానికొస్తే.. నైజాం (తెలంగాణ)లో రూ. 1.30 కోట్ల గ్రాస్.. సీడెడ్ (రాయలసీమ)లో రూ. 35 లక్షల గ్రాస్.. ఆంధ్ర ప్రదేశ్‌లో రూ. 1.60 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. మొత్తంగా తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ సినిమా రూ. 3.25 కోట్ల గ్రాస్ (1.71 కోట్ల షేర్) రాబట్టింది. కర్ణాటక + రెస్టాఫ్ భారత్ + ఓవర్సీస్ కలిసి రూ. 21 లక్షలు గ్రాస్ ప్రపంచ వ్యాప్తంగా రూ. 3.46 కోట్ల గ్రాస్ ( రూ. 1.81 కోట్ల షేర్) రాబట్టింది. రూ. 4.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగిన ఈ సినిమా ఇంకా రూ. 2.19 కోట్ల నష్టంతో డిజాస్టర్‌గా నిలిచింది. ఓవరాల్‌గా ఈ సినిమా టాక్‌కు వచ్చిన వసూళ్లకు చాలా తేడా ఉంది. (Twitter/Photo)
స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లు గడుస్తున్నా నగరాల్లో ఎన్నో వసతులు ఉన్నా .. అడవుల్లో నివసిస్తున్న గిరిజన ప్రజలకు సరైన వసతులు లేక నానా అవస్థలు పడుతున్నారన్నారు. రహదారులు, సరైన తిండి, వైద్యం, విద్యా వంటి వసతులు లేక ఎండనక, వానక కష్టపడుతూ ఎంతో దుర్భర జీవితం గడుపుతున్నారు. వారి వ్యథలను ఈ సినిమాలో చక్కగా చూపించారు. (Twitter/Photo)
మారేడిమిల్లిలో ప్రభుత్వం కల్పించాల్సిన సరైన సౌకర్యాలు లేకపోవడం.. అక్కడ రాజకీయ నాయకులు అక్కడ ప్రజలను కేవలం ఓటు బ్యాంక్‌గానే చూస్తుంటారు.మారేడుమిల్లి అనే ఓ ఊరు ప్రపంచానికి దూరంగా, కనీస అవసరాలు లేకుండా ఉంటుంది. దట్టమైన అడవుల మధ్యలో ఆ ఊరి జనం బతుకుతూ ఉంటారు. అయితే ఎన్నికల వేళ అక్కడికి ఓట్లు వేయించడం కోసం అల్లరి నరేష్ పోలింగ్ అధికారిగా తన టీంతో కలిసి వెళ్తాడు.