ప్రస్తుతం ఈయన హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం', ఇప్పటికే ఈ సినిమాకు సంబంధింంచిన టీజర్, ట్రైలర్‌తో ఈ సినిమా ఎలా ఉండబోతుందో చెపపాడు. నటుడిగా నరేష్ 59వ సినిమా. ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా ఫారెస్టు నేపథ్యంలో నడిచే కథ ఇది. హాస్య మూవీస్ - జీ స్టూడియోస్ వారు నిర్మించిన ఈ సినిమాకి, ఏఆర్ మోహన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా మొదటి రోజు సాధించిన వసూళ్ల విషయయానికొస్తే.. . (Twitter/Photo)
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం నాలుగు రోజులు బాక్సాఫీస్ కలెక్షన్స్ విషయానికొస్తే.. నైజాం (తెలంగాణ)లో రూ. 1.05 కోట్లు.. సీడెడ్ (రాయలసీమ)లో రూ. 24 లక్షలు ఆంధ్ర ప్రదేశ్‌లో రూ. 1.41కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. మొత్తంగా తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ సినిమా రూ. 2.70 కోట్ల గ్రాస్ (1.42 కోట్ల షేర్) రాబట్టింది. కర్ణాటక + రెస్టాఫ్ భారత్ + ఓవర్సీస్ కలిసి రూ. 16 లక్షలు గ్రాస్ ప్రపంచ వ్యాప్తంగా రూ. 2.84 కోట్ల గ్రాస్ ( రూ. 1.43 కోట్ల షేర్) రాబట్టింది. రూ. 4.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగిన ఈ సినిమా ఇంకా రూ. 2.57 కోట్లు రాబట్టాలి. ఓవరాల్‌గా ఈ సినిమా టాక్‌కు వచ్చిన వసూళ్లకు చాలా తేడా ఉంది. ఏమైనా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంటుందా అని చూడాలి. (Twitter/Photo)
ఈ సినిమాలో మారుమూల ప్రాంతమైన మారేడిమిల్లిలో ఎలక్షన్ నిర్వహించే పోలింగ్ అధికారి పాత్రలో అల్లరి నరేష్ నటించారు. ఈ చిత్రం ద్వారా అడవుల్లో నివసించే గిరిజన ప్రజలు సరైన వసతులు లేక పడుతున్న ఇబ్బందులను కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఈ చిత్రానికి సెన్సార్ వారు యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసారు. (Twitter/Photo)
స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లు గడుస్తున్నా నగరాల్లో ఎన్నో వసతులు ఉన్నా .. అడవుల్లో నివసిస్తున్న గిరిజన ప్రజలకు సరైన వసతులు లేక నానా అవస్థలు పడుతున్నారన్నారు. రహదారులు, సరైన తిండి, వైద్యం, విద్యా వంటి వసతులు లేక ఎండనక, వానక కష్టపడుతూ ఎంతో దుర్భర జీవితం గడుపుతున్నారు. వారి వ్యథలను ఈ సినిమాలో చక్కగా చూపించారు. (Twitter/Photo)
మారేడిమిల్లిలో ప్రభుత్వం కల్పించాల్సిన సరైన సౌకర్యాలు లేకపోవడం.. అక్కడ రాజకీయ నాయకులు అక్కడ ప్రజలను కేవలం ఓటు బ్యాంక్‌గానే చూస్తుంటారు.మారేడుమిల్లి అనే ఓ ఊరు ప్రపంచానికి దూరంగా, కనీస అవసరాలు లేకుండా ఉంటుంది. దట్టమైన అడవుల మధ్యలో ఆ ఊరి జనం బతుకుతూ ఉంటారు. అయితే ఎన్నికల వేళ అక్కడికి ఓట్లు వేయించడం కోసం అల్లరి నరేష్ పోలింగ్ అధికారిగా తన టీంతో కలిసి వెళ్తాడు.
ఇందులో అల్లరి నరేష్ టీచర్ క్యారెక్టర్ చేశారు. వృత్తిరీత్యా ఒక అడవిలోకి వెళ్తే.. అక్కడ పడుతున్న వారి బాధలు.. దానిపై ఎలాంటి పోరాటం చేసి.. ఎలాంటి మార్పు తీసుకొచ్చాం అనేది ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం చిత్రంలో చూపించారు. కేవలం 56 రోజుల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేశారు. ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ విషయానికొస్తే.. ఈ చిత్రం ప్రవంచ వ్యాప్తంగా రూ. 4 కోట్ల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చేసింది. బ్రేక్ కావాలంటే రూ. 4.5 కోట్లు రాబట్టాలి. ఈ సినిమాను నైజాం (తెలంగాణ)లో 150 పైగా థియేటర్స్‌లో విడుదల చేస్తున్నారు. సీడెడ్ (రాయలసీమ)లో60, ఆంధ్ర ప్రదేశ్‌లో 180 పైగా థియేటర్స్‌లో ఈ చిత్రాన్ని విడుదల కానుంది. . ప్రపంచ వ్యాప్తంగా 510 పైగా థియేటర్స్‌లో ఈ చిత్రం విడుదలైంది.