అల్లరి నరేష్..హాస్య చిత్రాల హీరోగా అల్లరి చేయడంలో అతను సీమటపాకాయ్. మంచి కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కితకితలు పెట్టడంలో ఫిట్టింగ్ మాస్టార్. తాజాగా ఈయన హీరోగా 20 యేళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ ఇరవై యేళ్లలో కేవలం కామెడీ సినిమాలే కాదు.. యాక్టింగ్‌కు అవకాశం ఉన్న పాత్రలతో నటుడిగా కూడా ప్రూవ్ చేసుకున్నారు. (Twitter/Photo)
తన నవ్వులతో ఆడియన్స్‌కు మడతకాజా తినిపించడంలో సీమశాస్త్రీ. గోపీ అంటూ గోడమీదపిల్లిలా నవ్వులు కురిపించిన..బెట్టింగ్ బంగార్రాజుగా వీక్షకులను సరదాగా కాసేపు నవ్వించిన అతనికే చెల్లింది. చంద్ర మోహన్, రాజేంద్ర ప్రసాద్‌ల తర్వాత తెలుగు కామెడీ సినిమాలకు అల్లరి నరేష్ కేరాఫ్ అడ్రస్‌గా మారారు. 20 యేళ్ల ప్రస్థానంలో దాదాపు 60కు పైగా చిత్రాల్లో నటించారు. (Twitter/Photo)
[caption id="attachment_1295296" align="alignnone" width="544"] తాజాగా అల్లరి నరేష్ .. ఇట్లు మారేడిమిల్లి ప్రజానీకం అంటూ ఓ సినిమా చేస్తున్నారు. సరైన సౌకర్యాలు లేని ఓ ప్రదేశం నేపథ్యంలో అల్లరి నరేష్ ఈ సినిమాలో అనారోగ్యం పాలైన ఓ వ్యక్తిని మంచెంపై పట్నంలో ఉన్న హాస్పిటల్‌కు తరలిస్తున్న ఫోటోను షేర్ చేశారు. హీరోగా అల్లరి నరేష్‌కు 59వ సినిమా. (Twitter/Photo)
తన మార్క్ అల్లరి నటనతో ప్రేక్షకుల్ని హాయిగా నవ్విస్తున్న నరేష్.. 1982 జూన్ 30న జిల్లా కోరుమామిడిలో ఇ.వి.వి.సత్యనారాయణ, సరస్వతి దంపతులకు జన్మించారు. చిన్నప్పటి నుంచి నరేష్ తెలివి తేటలు చూసి తనలా దర్శకుడు అవుతాడనుకున్న ఇ.వి.వి ఆలోచనలను తలక్రిందులు చేస్తూ నటుడిగా స్థిరపడ్డాడు. టాలీవుడ్ లో ప్రజెంట్ జనరేషన్లో హాస్య చిత్రాలకు ఐకాన్‌గా మారారు అల్లరి నరేష్.
నవ్వు తెప్పించే ముఖంతో, కొంటె డైలాగులతో హాస్యాన్ని పండించడంలో అల్లరి నరేష్ టైమింగే వేరు. హాస్య చిత్రాల కథానాయకుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న కేవలం హాస్య చిత్రాలకే పరిమితం కాకుండా ‘నేను’, ‘విశాఖ ఎక్స్ ప్రెస్ర్’, ‘డేంజర్’, ‘శంభో శివ శంభో’, ‘సుందరాకాండ’తో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ‘మహర్షి’లో హీరో ఫ్రెండ్ పాత్రలో కథను కీలక మలుపు తిప్పే పాత్రలో నటించి మంచి మార్కులు కొట్టేశారు. (Twitter/Photo)
నాంది చిత్రంతో సక్సెస్ ట్రాక్ ఎక్కిన అల్లరి నరేష్..ఈ సినిమాలో తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. నాందికి విజయ్ కనకమేడల దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రస్తుతం హిందీలో కూడా రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను హిందీలో అజయ్ దేవ్ గన్ చేస్తున్నారు. దిల్ రాజు నిర్మాణంలో పాలు పంచుకుంటున్నారు.మొత్తంగా 2021 అల్లరి నరేష్‌కు మంచి శుభారంభం అందించదనే చెప్పాలి.(Twitter/Photo)