అల్లరి నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన సినిమాలతో, తన నటనతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను సంపాదించుకున్నారు. అయితే ఆ మధ్య సరైనా విజయాలు లేక సతమతమవుతున్నా నరేష్‌కు నాంది పేరుతో వచ్చిన సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో నరేష్ మరోసారి తన నటనతో ఇరగదీశారు. ఆయన నటన గురించి కొత్తగా చెప్పడానికి ఏం లేదు. Photo : Twitter
ఓవైపు కామెడీని పండేస్తూనే మరోవైపు సీరియస్ పాత్రల్లో నటిస్తూ అదరగొడుతుంటారు. గమ్యంలో ఆయన ఓ రేంజ్లో ఉంటుంది. ప్రాణం సినిమాలో కూడా నరేష్ అదరగొట్టారు. ఇక నాంది విషయానికి వస్తే.. చేయని హత్య వల్ల శిక్ష అనుభవిస్తోన్న నరేష్ ఎలా ఆ కేసు నుంచి బయటపడ్డాడు. దానికి కారణం ఎవరు అనేది ఈ సినిమా కథ. తెలుగులో మంచి విజయాన్ని అందుకుంది. Photo : Twitter
అల్లరి నరేష్‌తో పాటు నాందిలో వరలక్ష్మి శరత్ కుమార్ మరో కీలకపాత్రలో కనిపించారు. ఆమె ఈ సినిమాలో లాయర్ గా అదరగొట్టారు. విజయ్ కనకమేడల చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాను దర్శకుడు సతీశ్ వేగేశ్న నిర్మించారు. ఈ సినిమాలో ప్రస్తుతం హిందీలో రీమేక్ అవుతోంది. హిందీలో ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇక అది అలా ఉంటే నరేష్ నాంది సూపర్ హిట్ తర్వాత తాజాగా మరో సినిమాను ప్రకటించారు. Photo : Twitter
శ్రీరామ నవమి సందర్భంగా కొత్త సినిమాని ఇంట్రెస్టింగ్ టైటిల్ తో అనౌన్స్ చేశారు. ఆ సినిమానే “ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం”. ఈ సినిమాకు ఏ ఆర్ మోహన్ దర్శకత్వం వహించనున్నారు. హీరోయిన్గా కయాల్ ఆనంది కనిపించనున్నారు. తన కెరీర్ లో 59వ సినిమాగా దీనిని ఈ స్పెషల్ డే కి అనౌన్స్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని నరేష్ తెలిపారు. ఇక ఈ సినిమాను హాస్య మూవీస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చూడాలి మరి ఈ సినిమా నరేష్‌కు ఎలాంటీ ఫలితాన్ని ఇస్తుందో.. Photo : Twitter