ఆలియా తాజాగా ఫోటో షూట్ చేసింది. ప్రెగ్నెంట్ అయ్యాక...తొలిసారిగా ఆలియా చేసిన ఫోటో షూట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ ఫోటో షూట్లో ఆలియా పింక్ కలర్ డ్రెస్సులో మెరిసింది. గర్భవతి అయిన త్వరలో కరణ్ జోహార్ చాట్ షో 'కాఫీ విత్ కరణ్' సీజన్ 7లో రణవీర్ సింగ్‌తో కలిసి కనిపించనుంది. కరణ్ జోహార్‌తో కలిసి ఆలియా, రణవీర్ సింగ్ కాఫీ తాగుతున్న ఈ షో ప్రోమో వచ్చింది.
అంతేకాదు ఈ ఫోటోలో ఆలియా తన ఎంగేజ్మెంట్ రింగ్ కూడా చూపిస్తుంది. ఈ సంవత్సరం నేను కాఫీ తాగాను అని అలియా ఈ ఫోటోలకు ఓ క్యాప్షన్ కూడా షేర్ చేసింది. దీంతో ఆమె అభిమానులు.. మీరు కాఫీ విత్ కరణ్ షోకు వెళ్లారా అంటూ ప్రశ్నిస్తున్నారు. మరికొందరు ఫ్యాన్స్ మాకు స్వీట్ ఎప్పుడు తినిపిస్తున్నావు అంటూ ఆలియాను ప్రశ్నిస్తున్నారు.
ఇక ఆలియా భట్, రణబీర్ కపూర్ల వివాహం ఏప్రిల్ 14న రణబీర్ కపూర్ బాంద్రాలోని ఇల్లు వాస్తులో జరిగింది. ఇక ఆలియా సినిమాల విషయానికి వస్తే.. రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవ్‌గణ్‌ల ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో మంచి విజయాన్ని అందుకుంది. RRRలో సీత పాత్రలో నటించింది. ఆ సినిమాతో పాటు అలియా భట్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన 'గంగూబాయి కతియావాడి' సినిమాతో నటించి అదరగొట్టారు