సినిమాలతో పాటు బిజినెస్ పరంగాను దూసుకుపోతోన్న ఆలియా భట్.. తన పిల్లల కోసం కాన్షియస్ క్లాతింగ్ పేరుతో ఓ దుస్తుల వ్యాపారాన్ని స్టార్ట్ చేసింది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్‌లకు ఆ కంపెనీ దుస్తులను ప్యాక్ చేసి పంపించింది. యూ ఆర్ మై ఫేవరెట్ హ్యూమన్ బీన్ అనే బ్యాగ్ లో ప్యాక్ చేయడమే గాక.. ఆ బ్యాగులపై అభయ్ రామ్, భార్గవ్ రామ్ పేర్లు కూడా రాసిపెట్టింది.