మ్యారేజ్ కు ముందు తాను ఒక హాలీవుడ్ మూవీ షూటింగ్ లో పాల్గొన్నానని ఆ సమయంలో అప్పటికే తాను గర్భవతిని కావడంతో యాక్షన్ సీన్లు చేయడానికి ఇబ్బందులు ఎదురయ్యాయని అలియా భట్ పేర్కొన్నారు.అయితే తాను ప్రెగ్నెంట్ అన్న విషయం సినిమా యూనిట్ కు తెలుసని అందువల్ల యాక్షన్ సీన్లు చేసే సమయంలో వాళ్లు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారని అలియా భట్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
గంగూభాయ్ కతియావాడితో హిట్ అందుకున్న ఆలియా భట్ తన మొదటి హాలీవుడ్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. అందులో భాగంగా తన సహ నటి గాల్ గాడోట్తో ఉన్న కొన్ని ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు. తాజాగా ఆలియా భట్ హార్ట్ ఆఫ్ స్టోన్ షూటింగ్ ముగించుకుని ఇంటికి వచ్చింది. ఇది ఆలియాకు తొలి హాలీవుడ్ చిత్రం. ఈ సినిమా నటి మేలో షూటింగ్ ప్రారంభించింది. Photo : Instagram
ప్రెగ్నెంట్ అయిన సమయంలోనే ఆలియా భట్ తన మొదటి హాలీవుడ్ చిత్రానికి శ్రీకారం చుట్టింది. ఈ నటి హాలీవుడ్ స్టార్ గాల్ గాడోట్తో కలిసి హార్ట్ ఆఫ్ స్టోన్ షూటింగ్ చేస్తోంది. ఈ స్పై థ్రిల్లర్లో గాల్ గాడోట్, జామీ డోర్నన్లతో కలిసి ఆలియా కనిపించనుంది. ఇక ఆలియా తొలి హాలీవుడ్ చిత్రం కోసం అభిమానులు చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు టామ్ హార్పర్ దర్శకత్వం వహించారు.