ఆర్ ఆర్ ఆర్ హీరోయిన్ అలియా భట్, రణబీర్ కపూర్లు తమ ప్రేమ బంధాన్ని పెళ్లి బంధంగా మార్చుకున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఆలియా భట్ ప్రెగ్నెంట్ అయ్యిందని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఆమె తన సోషల్ మీడియాలో పేర్కోంది. మా బేబీ త్వరలో వస్తోంది అంటూ రాసుకున్నారు. దీంతో దీనికి సంబంధించిన పిక్ వైరల్ అవుతోంది. ఇక వీరి వివాహం ఏప్రిల్ 14న రణబీర్ కపూర్ బాంద్రాలోని ఇల్లు వాస్తులో జరిగింది. Photo : Instagram
Alia Bhatt : ఆలియా భట్ సినిమాల విషయానికి వస్తే.... తన తండ్రి మహేష్ భట్ వారసత్వంగా సినిమాల్లోకి వచ్చింది. అయినా తనదైన నటనతో ప్రేక్షకుల్నీ మెప్పిస్తోంది. ఆమె నటించిన మొదటి సినిమా 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్', ఆ తర్వాత 'డియర్ జిందగీ, 'హైవే', 'రాజీ' మొదలగు సినిమాలు మంచి పేరును తెచ్చిపెట్టాయి. ఆమె నటించిన గంగూబాయి కతియావాడి ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా మంచి ఆదరణ పొందింది. అంతేకాదు అలియాకు మంచి పేరును తెచ్చింది.Photo : Twitter
ఇక ఆలియా భట్ నటించిన ఆర్ ఆర్ ఆర్ విషయానికి వస్తే.. రౌద్రం రణం రుథిరం (Roudram Ranam Rudhiram) పేరుతో (NTR) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు (Ram Charan) ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా వచ్చిన సంగతి తెలిసిందే. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి ఆదరణ పొందింది. అంతేకాదు పాత రికార్డ్స్‌ను బ్రేస్తూ కేక పెట్టిస్తోంది. అందులో భాగంగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1200 కోట్లను వసూలు చేసింది.. (Image: Instagram)
దీనికి సంబంధించి ఆర్ ఆర్ ఆర్ (RRR) టీమ్ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఆర్ ఆర్ ఆర్ అమెరికాలో కూడా ఓ రేంజ్లో అదరగొట్టింది. నార్త్ అమెరికాలో ఈ సినిమా 13 మిలియన్ డాలర్స్‌పైగా వసూలు చేసి 100 కోట్ల గ్రాస్‌ను అందుకుంది. దీంతో ఆర్ ఆర్ ఆర్ టీమ్ దీనికి సంబంధించి ఓ పోస్టర్‌ను విడుదల చేసింది.. (Image: Instagram)
ఇక మరోవైపు ఈ సినిమా (RRR) ప్రస్తుతం ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. అయితే హిందీ రైట్స్ మాత్రమే నెట్ ఫ్లిక్స్ (RRR on Netfilx) సొంతం చేసుకోగా.. మిగితా సౌత్ భాషల రైట్స్‌ను జీ5 (Zee5) సొంతం చేసుకుంది. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం అందించారు.. (Image: Instagram)