బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ తల్లి కాబోతుందని తాజాగా చేసిన పోస్ట్ ద్వారా అర్థం అవుతోంది. స్కానింగ్ చేయించుకుంటోన్న పిక్‌తో పాటు రెండు సింహాలు.. ఓ చిన్న సింహం కూనతో కలిసున్న ఫొటోను కూడా ఆలియా షేర్ చేసింది. దీంతో ఆమె గర్భవతి అయిందని స్పష్టం అవుతోంది. దీంతో వీళ్లిద్దరి అభిమానులతో పాటు సినీ ప్రియులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఆలియా బాలీవుడ్ ప్రముఖ షో కాఫీ విత్ కరణ్‌లో కూడా పాల్గొంది. కాఫీ విత్ కరణ్’ సీజన్ (Coffee with karan)7కు సంబంధించిన ప్రోమోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్లో అత్యంత ఆదరణ పొందుతున్న సెలబ్రిటీ టాక్ షో ఇది. నిర్మాత కరణ్ జోహార్ (karan johar)ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.
ఈ షో కరణ్ జోహార్ వల్లే సగం హిట్ అయ్యింది. సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలు బయటకు లాగడంలో కరణ్ జోహార్ పెట్టింది పేరు. అందుకే ఈ షోకు అంత క్రేజ్. ఈ నెల 7 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో ప్రీమియర్ కానున్న ఫస్ట్ ఎపిసోడ్‌కు రణ్వీర్ సింగ్, ఆలియాభట్ (Aliabhatt)హాజరయ్యారు. కరణ్ అడిగిన ప్రశ్నలకు ఆలియా చురుకుగా సమాధానమిచ్చారు.
ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్ వివాహం తర్వాత కూడా తమ కెరీర్లను చక్కగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇప్పటికే వీళ్లిద్దరూ పలు చిత్రాలను కూడా పూర్తి చేసుకున్నారు. అందులో జంటగా నటిస్తోన్న 'బ్రహ్మాస్త్ర' ఒకటి. ఇది కాకుండా రణ్‌బీర్ 'షంషేరా', 'యానివల్' మూవీలు చేస్తున్నాడు. ఆలియా 'డార్లింగ్స్', 'రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ' వంటి చిత్రాలు చేస్తోంది.
ఆలియా నటించిన గంగుబాయి కతియావాడి ఎంత మంచి పేరు తెచ్చి పెట్టిందో తెలిసిందే. ఈ సినిమాలో ఆలియా నటనను విమర్శకులు సైతం ప్రశంసించారు. గంగూ బాయి సినిమాను ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలి తెరకెక్కించాడు. ఎస్ హుస్సేన్ జైదీ, జేన్ బార్గ్స్ అనే ఇద్దరు రైటర్స్ ముంబాయిలోని ప్రతీ కోణాన్ని పరిశీలించి అండర్‌వరల్డ్ ప్రపంచం గురించి అందరికీ చెప్పే 'మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబాయి' అనే పుస్తకాన్ని రాశారు. అందులో ఒక చాప్టర్ 'గంగూబాయి'.