డెలివరీ టైం దగ్గర పడటంతో ఆమె ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యింది. ఆ తర్వాత ఆలియా తల్లి సోని రజ్దాన్ కూడా ఆస్పత్రికి చేరుకున్నారు. ఆలియా రణ్ బీర్ ఈ ఏడాది ఏప్రెల్లో పెళ్లి చేసుకున్నారు. అయితే వివాహం జరిగినకొన్ని రోజులకే... ఆలియా తాను ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేసి అందరికీ షాక్ ఇచ్చింది. Photo Twitter
ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఆలియా భట్.. అంతకుముందు ఓ రియాలిటీ షోలో పాల్గొంది. ఈ సందర్భంగా ఓ కంటెస్టెంట్గా ఉన్న ఓ చిన్న అబ్బాయిని తన పేరు స్పెల్లింగ్ చెప్పమని అడిగింది. దానికి ఆ చిన్నారి... ALMAA అని చెప్పాడు. దీంతో ఆలియా గట్టిగా నవ్వతూ... అల్మా.. బహుత్ సుందర్ నామ్ హై.. నా కూతురుకు ఇదే పేరు పెడతాను అంటూ ఆ షోలో వ్యాఖ్యలు చేసింది.