బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఆలియా భట్... యంగ్ హీరో రణబీర్ కపూర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ జంట ఏడాది తల్లిదండ్రులు అయ్యారు. పెళ్లైన కొన్నినెలలుకే వీరిద్దరు పేరెంట్స్‌గా ప్రమోషన్ పొందారు. ఆలియా ఆదివారం ఆస్పత్రిలో చేరి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆదివారం ఉదయం ముంబైలోని హెచ్ఎన్ రిలయన్స్ ఆస్పత్రిలో ఆలియా భట్ తన భర్తతో కలిసి వచ్చింది. Alia bhatt Instagram
ఆలియా ఇటీవల తన కూతురు పేరును రివీల్ చేస్తూ షేర్ చేసిన పిక్‌లో చిన్నారి డ్రెస్ ఉన్న పోస్టర్ పై రాహా అనే పేరుతో ఉన్న పిక్‌ను షేర్ చేసింది. ఈ పిక్‌లో ఆలియా రణ్‌బీర్ కూడా ఉన్నారు. రణ్ బీర్.. పాపను ఎత్తుకున్నాడు. అయితే వీరిద్దరు కెమెరాకు బ్యాక్ సైడ్‌లో ఫోజులిచ్చారు. అంతేకాదు వీరిద్దరి ముఖాలు కూడా ఈ ఫోటోలో బ్లర్‌గా ఉన్నాయి.
ఆలియా విషయానికి వస్తే.. ఈ భామ ప్రెగ్నెన్సీ టైంలో కూడా సినిమాల్లో, షూటింగుల్లో పాల్గొంటూ... సందడి చేసింది. బ్రహ్మస్త్ర ప్రమోషన్లలో కూడా బేబీ బంప్‌తో కనిపించింది ఆలియా. బ్రహ్మస్త్రలో ఆలియా రణ్‌బీర్ కలిసి నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ సాధించింది. బాలీవుడ్ ఇండస్ట్రీకి చాలా రోజుల తర్వాత ఓ హిట్ అందించింది.