మరోవైపు ఆలియా విషయానికి వస్తే.. ఈ భామ ప్రెగ్నెన్సీ టైంలో కూడా సినిమాల్లో, షూటింగుల్లో పాల్గొంటూ... సందడి చేసింది. బ్రహ్మస్త్ర ప్రమోషన్లలో కూడా బేబీ బంప్‌తో కనిపించింది ఆలియా. బ్రహ్మస్త్రలో ఆలియా రణ్‌బీర్ కలిసి నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ సాధించింది. బాలీవుడ్ ఇండస్ట్రీకి చాలా రోజుల తర్వాత ఓ హిట్ అందించింది. Photo Twitter
కొన్ని రోజులుగా ఆలియా డెలివరీ సమయం దగ్గర పడిందని, అందుకే హాస్పిటల్లో ఉందని వార్తలు వినిపించాయి. కాగా.. ఈ రోజు (నవంబర్ 6న) ఆలియాకి ప్రసవం అయ్యింది. సరిగ్గా 12.05 గంటలకి పండంటి ఆడబిడ్డ (Girl)కి ఈ బ్యూటీ జన్మనిచ్చింది. దీంతో కపూర్ ఫ్యామిలీ తమ ఇంటికి మహాలక్ష్మీ వచ్చిందంటూ ఆనందంలో మునిగి తేలుతున్నారు.