అలీ కూతురు డాక్టర్ చదువుతుండగా కాబోయే అల్లుడు కూడా డాక్టర్ అని తెలుస్తోంది. ప్రస్తుతం తన కూతురు పెళ్లి పనులతో బిజీ బిజీగా ఉన్న అలీ.. ఈ వేడుకను కన్నులపండుగగా నిర్వహించాలని సన్నాహాలు చేస్తున్నారు. పెళ్లి పనులు వేగంగా జరిపిస్తూనే స్వయంగా వెళ్లి సన్నిహితులందరికీ ఆహ్వాన పత్రికలు అందచేస్తున్నారు అలీ దంపతులు.