Ali Daughter Marriage: టాలీవుడ్ స్టార్ కమెడియన్ అలీ ఇంట పెళ్లి వేడుక జరిగిన విషయం తెలిసిందే. అలీ పెద్ద కూతురు ఫాతిమ పెళ్లి నిన్న హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ రోజు గుంటూరులో వివాహా రిసెప్షన్ శ్రీ కన్వర్షన్ హాల్ లో అంగరంగ వైభవం గా జరిగింది. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఛీప్ గెస్ట్‌గా హాజరై కొత్త దంపతులను ఆశీర్వదించారు. (Twitter/Photo)
అలీ కూతురు పెళ్లి రిసెప్షన్‌కు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు Mlc లేళ్ళ అప్పిరెడ్డి,Mla ఉండవల్లి శ్రీదేవి,Mla షేక్ మహమ్మద్ ముస్తఫా, గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు,మార్కెట్ యార్డ్ చైర్మన్ ఏసురత్నం,డిప్యూటీ మేయర్ సుజీలా, డైమండ్ వాజ్రా బాబు,గుంటూరు sp ఆరిఫ్ హాఫిజ్,గుంటూరు కలెక్టర్ వేణుగోపాల్,మాజీ ఎంపీ మోదుగుల వేణు గోపాలరెడ్డి,మాజీ mla మర్రి రాజశేఖర్ తదితరులు హాజరై ఆలీ కూతురు ఫాతిమా దంపతులను ఆశీర్వదించారు. (Twitter/Photo)
హైదరాబాద్‌లోని ఓ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన వివాహ మహోత్సవానికి టాలీవుడ్ ప్రముఖలంతా తరలివచ్చినా.. నటరత్న బాలకృష్ణతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. వివాహ వేడుకకు పవన్ హాజరు కాలేదు.వీళ్లిద్దరు వైసీపీకి ప్రత్యర్ధులైన టీడీపీ, జనసేనకు చెందిన నాయకులు కూడా అలీ.. తమ ప్రత్యర్ధి పార్టీలో ఉండటంతో ఈ వేడుకకు హాజరు కాలేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. (Twitter/Photo)
కమెడియన్‌గా మంచి పీక్‌లో ఉన్నప్పుడే ఎస్వీ కృష్ణారెడ్డి తన సినిమాలో ఆలీని హీరోగా పెట్టి అందరినీ సర్ ప్రైజ్ చేశాడు. ముందు ఎన్నో కామెంట్స్ చేసినవారే ఆ తర్వాత ‘యమలీల’ విజయం చూసి ఆలీతో సినిమా తీసేందుకు క్యూ కట్టారు. అమాయకుడైన యువకుడిగా, అందమైన అమ్మాయి ప్రేమకోసం తపించే ప్రేమికుడిగా అందులో ఆలీ నటన ఎంతమందిని నవ్వించిందో అంతమందినీ కంటతడిపెట్టించింది.