గతేడాది గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కిన ‘జెర్సీ’ మూవీని హిందీలో షాహిద్ కపూర్ హీరోగా అదే టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్, దిల్ రాజు, అమన్ గిల్‌తో సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్‌తో మంచి హిట్ అందుకున్న షాహిద్ కపూర్ ఇపుడు ‘జెర్సీ’ తో మరో హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. ఈ చిత్రంలో మృణాల్ ఠాగూర్ హీరోయిన్గా నటిస్తోంది. (Twitter/Photo)
నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమాను హిందీలో రీమేక్ చేయడానికి రంగం సిద్ధం అయింది. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం కాన్సెప్ట్ అన్ని భాషల్లో వర్కౌట్ అయ్యేలా ఉండటంతో ఈ చిత్రాన్ని హిందీతో పాటు పలు భాషల్లో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్ర హిందీ రీమేక్‌లో కూడా నవీన్ పొోలీశెట్టి నటించే అవకాశం ఉంది. (Twitter/Photo)
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘టాక్సీవాలా’ చిత్రాన్ని హిందీలో ‘ఖాళీ పీలి’ బాలీవుడ్లో రీమేక్ చేస్తున్నారు. హిందీ రీమేక్‌లో ఇషాన్ ఖట్టర్, అనన్య పాండే హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, అలీ అబ్బాస్ జఫర్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మక్బూల్ ఖాన్ డైరెక్ట్ చేయనున్నాడు. (Twitter/Photo)
శ్రీ విష్ణు, సత్యదేవ్, నివేదా థామస్, నివేదా పేతురాజ్ నటించిన ‘బ్రోచేవారెవరురా’ సినిమాను హిందీలో రీమేక్ చేయనున్నట్టు సమాచారం. తెలుగు వెర్షన్ డైరెక్ట్ చేసిన వివేక్ ఆత్రేయ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నట్టు సమాచారం. ఈ సినిమా రీమేక్‌లో సన్ని దేవోల్ కుమారుడు కరణ్ దేవోల్ హీరోగా నటించే అవకాశం ఉంది. (Twitter/Photo)