Forein Citizenships | తెరపై కనిపించే నటులను మన వాళ్లు గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు. ఇంట్లో వాళ్లనైనా ఏమైనా అంటే సహిస్తారు కానీ.. తమ అభిమాన నటులను వేరే వాళ్లు తక్కువ చూస్తే అస్సలు ఊరుకోరు. ముఖ్యంగా మన భారతీయ ప్రేక్షకులు ఒక్కసారి అభిమానిస్తే.. జీవితాంతం వారిని ఆరాధిస్తూనే ఉంటారు. ఇక మన దగ్గర స్టార్స్‌గా చెలామణిలో ఉన్న చాలా మంది నటీనటులు కొందరు విదేశీలు. భారతీయ మూలాలున్న వారికి ఇక్కడ పౌరసత్వం లేదు. ఈ రకంగా ఫారిన్ సిటిజన్‌షిప్ ఉన్న కొందరు స్టార్స్ ఎవరెవరున్నారో చూద్దాం..
అక్షయ్ కుమార్ కెనడా పౌరసత్వం | బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్‌కు మన దేశంలో ఎంతో మంది వీరాభిమానులున్నారు. అయితే ఈ హీరోకు భారతయ పౌరసత్వం లేదు. ఈయన అసలు పేరు ‘రాజీవ్ హరిఓం భాటియా’. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో జన్మించారు. ఢిల్లీలో పెరిగాడు. 2011లో కెనడా దేశం గౌరవ పౌరసత్వం ఇచ్చింది. మన దగ్గర ద్విపౌరసత్వం లేదు. అందుకే మన దేశం పౌరసత్వం ఒదులుకోవాల్సి వచ్చింది. (File/Photo)
భారతీయ పౌరసత్వం ఒదులుకోవడంపై అతనిపై చాలా మంది సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోసారు. ఇక్కడ ప్రజల సొమ్ముతో స్టార్ అయిన అక్కీ.. ఇక్కడ పౌరసత్వం ఎందుకు ఒదులుకున్నారనే విషయమై పెద్ద రచ్చే నడిచింది. దీనిపై అక్షయ్ విరవణ కూడా ఇచ్చారు. ఇప్పటికే భారతీయ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకుంటున్నట్టు చెప్పారు. (File/Photo)
ఆలియా భట్ | బాలీవుడ్‌తో పాటు రాజమౌళి దర్శత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీతో ప్యాన్ ఇండియా ప్రేక్షకులకు చేరువయింది. బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు మహేష్ భట్ కూతురుగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈమెకు ముంబైలోని జుహులో సొంతిల్లు కూడా ఉంది. ఈమె భారతీయులు కాదు. ఈమెకు బ్రిటన్ పౌరసత్వం ఉంది. ఈమె తల్లి మహేష్ భట్ రెండో భార్య సోనీ రజ్దాన్ బ్రిటన్ పౌరురాలు. ఆ రకంగా వచ్చిన బ్రిటన్ సిటిజన్పిష్ను ఆమె ఒదులుకోవడానికి సిద్దపడలేదు. అటు భారతీయ పౌరసత్వం కోసం దరఖాస్తు చేయలేదు. (File/Photo)
కత్రినా కైఫ్ | తెలుగు ప్రేక్షకులకు మల్లీశ్వరిగా పరిచయమైన ఈమె భారతీయులు కాదు. ఈమె భారతీయ కశ్మీర్ మూలాలున్న తండ్రికి.. బ్రిటిష్ లాయరైన సుజానే టర్కోట్కి హాంకాంగ్‌లో జన్మించింది. సుజానే లాయరే కాదు. ఈమె స్వచ్ఛంద కార్యకర్త. ఈమె పలు దేశాల్లో పనిచేసి బ్రిటన్‌లో స్థిరపడింది. కత్రినా మెడలింగ్‌లో అడుగుపెట్టి మొదట కైజాద్ గుస్తాద్ బాలీవుడ్‌కు ఆహ్వానించాడు. అలా బీటౌన్‌లో అడుగుపెట్టి స్టార్‌గా ఎదిగింది. ఇపుడు భారతీయుడైన ప్రముఖ నటుడు విక్కీ కౌశల్‌ను పెళ్లాడింది. మరి ఇపుడున భారతీయ పౌరురాలిగా మన దేశానికి దరఖాస్తు చేసుకుంటుందా అని చూడాలి. (Twitter/Photo)
సన్ని లియోన్ | సన్ని లియోన్ ఒకప్పటి శృంగార తారగా గుర్తింపు తెచ్చుకుంది. ఈమె కూడా భారతీయులు కాదు. ఈమె అసలు పేరు కరణ్‌జీత్ కౌర్ వోహ్రా. కెనడాలో సెటిలైన పంజాబీ ఫ్యామిలీ. అక్కడ పోర్న్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. ఇక్కడ బిగ్‌బాస్ షోతో బాలీవుడ్లో లెగ్ పెట్టింది. ఈమె కూడా భారతీయురాలిగా మారేందకు మన దేశానికి ఎలాంటి దరఖాస్తు చేయలేదు. (File/Photo)
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ | బాలీవుడ్‌తో పాటు సాహోతో తెలుగు ఆడియన్స్‌కు పరిచయమైన జాక్వెలిన్ ఫెర్నాండెజ్ శ్రీలంక పౌరురాలు. ఈమె 2006లో మిస్ యూనివర్స్ శ్రీలంకగా అందాల భామగా కిరీటం సొంతం చేసుకుంది. ఈమె సల్మాన్ ప్రోద్బలంతో ఇక్కడే సెటిలైంది. ఈమెకు కెనడా, శ్రీలంక, మలేషియా మూలాలున్న జాక్వెలిన్ ఇప్పటికీ శ్రీలంక పౌరురాలే. (File/Photo)
అమీ జాక్సన్ | ఏ మాత్రం భారతీయ మూలాలు లేని అచ్చమైన విదేశీ బ్యూటీ అమీ జాక్సన్. అపుడెపుడో పుష్కర కాలం క్రితం ‘టీన్ గ్రేట్ బ్రిటన్’ అందాల కిరీటం ఈమెను వరించింది. అపుడే ‘మద్రాసు పట్టణం’ ఓ బ్రిటిష్ దొరసాని పాత్ర కోసం వెతుకున్న డైరెక్టర్ కంట పడింది. అలా ఈ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. సినిమాల కోసం ఈమె బ్రిటన్, భారత్ మధ్య తిరుగుతూనే ఉంది. ఈమెకు బ్రిటన్ పౌరసత్వం ఉంది.
ఇమ్రాన్ ఖాన్ | ఆమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్... ఇక్కడ పలు చిత్రాల్లో నటించినా పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు. ఇతను ఇక్కడ అమ్మాయి అవంతికా మాలిక్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఇతను ఇక్కడే ఉంటున్న అతను అమెరికన్ సిటిజన్. ఇతను అక్కడ విస్కాన్సిన్లోని మాడిసన్లో జన్మించాడు. తల్లిదండ్రులు విడిపోయాక.. ఇక్కడ ముంబైలో స్థిరపడ్డాడు. ఇక్కడ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్న నిబంధనల ప్రకారం అమెరికన్ సిటిజన్ షిప్ ఒదులుకోవాలంటే .. పదేళ్ల పన్నులు ముందుగానే చెల్లించాలి. ఆ భారం ఎక్కువగా ఉండటంతో అమెరికన్ పౌరసత్వాన్నే కంటిన్యూ చేస్తున్నాడు. (File/Photo)