Akshay Kumar: రియల్ హీరోలతో అక్షయ్ కుమార్.. బీఎస్‌ఎఫ్ జవాన్‌లతో బాలీవుడ్ ఖిలాడి..

Akshay Kumar: బాలీవుడ్ అగ్ర హీరో అక్షయ్ కుమార్ ఈ రోజు సరిహద్దుల్లో గస్తీ కాసే సరిహద్దు భద్రతా దళం (BSF) సైనికులతో గడిపారు. ఈ సందర్భంగా అక్షయ్ కుమార్ మాట్లాడుతూ.. రియల్ హీరోలతో ఇలా సమయం గడిపే అవకాశం రావడం తన అదృష్టమన్నారు. భరత మాత సేవలో తరించే సైనికులే నిజమైన హీరోలు. వాళ్లు కంటి రెప్పలా సరిహద్దులను కాపాడబట్టే మనం హాయిగా బతుకుతున్నామన్నారు. ఈ సందర్భంగా వాళ్లతో గడిపిన మధుర క్షణాలను అభిమానులతో సోషల్ మీడియాలో పంచుకున్నారు.