Akshay Kumar - Samrat Prithviraj OTT Streaming | బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సమ్రాట్ పృథ్వీరాజ్’. థియేట్రికల్ పరంగా అంతగా వర్కౌట్ కాలేదు. తాజాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. అంతేకాదు ఈ సినిమా ఓటీటీ విడుదల తేదిని అధికారికంగా ప్రకటించింది. (File/Photo)
హిందూస్థాన్ సింహంగా పేరు గాంచిన ‘సమ్రాట్ పృథ్వీరాజ్ చౌహాన్ జీవిత కథపై ‘సమ్రాట్ పృథ్వీరాజ్’ టైటిల్‌తో చారిత్రక సినిమా చేసిన సంగతి తెలిసిందే కదా. యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని చంద్రప్రకాష్ ద్వివేది డైరెక్ట్ చేసారు. ఈ సినిమాకు ఓ వర్గం ప్రేక్షకులకు నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. (Twitter/Photo)
హిందూ ధర్మ స్థాపన కోసం సమ్రాట్ పృథ్వీరాజ్ చేసిన పోరాటం ఈ సినిమాలో హైలెట్‌గా నిలిచాయి. ఈ సినిమాలో ఇతర ముఖ్యపాత్రల్లో సంజయ్ దత్, సోనూసూద్ నటించారు. మరోవైపు ఈ చిత్రంలో అక్షయ్ కుమార్‌కు జోడిగా మాజీ ప్రపంచ సుందరి మానుషీ చిల్లర్ కథానాయికగా ఈ సినిమాతో పరిచయమైంది. ఈ సినిమాలో రాణి సంయోగిత పాత్రలో నటించింది. (File/Photo)
అక్షయ్ కుమార్ తన మూడు దశాబ్దాల కెరీర్లో ఇంతటి భారీ చారిత్రాత్మక పాత్రను ఎప్పుడూ పోషించలేద. తొలిసారి సమ్రాట్ పృథ్వీరాజ్ పాత్రలో అదరగొట్టాడు. ఇక ‘సమ్రాట్ పృథ్వీరాజ్ చౌహాన్ పాత్రను తెరపై పోషించడం గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. ఈ హిస్టారికల్ గాథను అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా జూలై 1 నుండి ప్రతి ఇంటికి అందిస్తున్నందుకు, ఈ మాధ్యమం ద్వారా గొప్ప భారతీయ యోధుడు, గొప్ప రాజు సామ్రాట్ పృథ్వీరాజ్ చౌహాన్ స్ఫూర్తిదాయకమైన కథ ప్రపంచవ్యాప్తంగా చేరుతున్నందుకు నాకు సంతోషంగా ఉందన్నారు అక్షయ్ కుమార్.
లెజండరీ త్రయం శంకర్-ఎహసాన్-లాయ్ సంగీతంతో, సామ్రాట్ పృథ్వీరాజ్ సిరీస్… భారతదేశ చరిత్రలో గొప్ప రాజులు, నిర్భయమైన యోధులలో ఒకరైన చౌహాను రాజవంశానికి చెందిన పృథ్వీరాజ్ చౌహాన్ స్ఫూర్తిదాయకమైన వినోదాత్మకమైన కథను కళ్లకు కడుతుంది. ఈ చారిత్రక యాక్షన్ డ్రామాలో సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. ఇది కవి చంద్ వర్దాయి రాసిన 'పృథ్వీరాజ్ రాసో' అనే పురాణ కవిత ఆధారంగా రూపొందించబడింది.