Akshay Kumar OMG 2 : ఉజ్జయినిలో ప్రారంభమైన అక్షయ్ కుమార్ OMG 2 షూటింగ్..

Akshay Kumar - Pankaj Tripathi - OMG 2 | అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘ఓ మై గాడ్’ మూవీకి సీక్వెల్‌గా ‘OMG 2’ (ఓ మై గాడ్ 2) మూవీకి సీక్వెల్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే ముంబైలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. తాజాగా ఈ సినిమా షూటింగ్‌లో అక్షయ్ కుమార్ జాయిన్ అయ్యారు. ’ఓ మై గాడ్’లో శ్రీ కృష్ణ భగవానుడిగా కనిపించిన అక్షయ్ కుమార్ ఈ సారి ‘ఓ మై గాడ్ 2’ లో మహా కాళేశ్వరుడిగా కనిపించనున్నారు. తాజాగా ఉజ్జయినిలో జరుగుతోన్న ఈ సినిమా షూటింగ్‌లో అక్షయ్ కుమార్ పాల్గొన్నారు.