Home » photogallery » movies »

AKSHAY KUMAR DHANUSH SARA ALI KHAN ATRANGI RE MOVIE ANNOUNCED DIRECTED BY AANAND L RAI TA

అక్షయ్ కుమార్, ధనుశ్, సారా అలీ ఖాన్ కొత్త చిత్రం ప్రారంభం..

బాలీవుడ్ హిట్ మిషన్ అక్షయ్ కుమార్ మరో కొత్త సినిమాకు ఓకే చెప్పాడు. గతేడాది.. ‘కేసరి’, ‘మిషన్ మంగళ్’, ‘హౌస్‌ఫుల్ 4‘ ‘గుడ్ న్యూస్’ వంటి డిఫరెంట్ మూవీస్‌తో అలరించి బాక్సాఫీస్ షేక్ చేసిన అక్షయ్ కుమార్.. తాజాగా ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వంలో కొత్త సినిమాకు ఓకే  చెప్పాడు. ఈ చిత్రంలో రజినీకాంత్ అల్లుడు ధనుశ్ మరో హీరోగా నటిస్తున్నాడు. గతంలో ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వంలో చేసిన‘రాంజానా’ సినిమాతో ధనుశ్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ‘షమితాబ్’ సినిమాలో యాక్ట్ చేసాడు. ఇపుడు ‘ఐత్ రంగీ రే’ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో సారా అలీ ఖాన్ హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ విడుదల చేసారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చి 1వ తేది నుంచి స్టార్ట్ కానుంది. అంతేకాదు ఈ చిత్రాన్ని వచ్చే 2021 ఫిబ్రవరి 14 న విడుదల చేయనున్నారు. ఈ ఇయర్ మాత్రం అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘సూర్యవంశీ’, ‘లక్ష్మీ బాంబ్’, ‘పృథ్వీరాజ్’ సినిమాలు విడుదల కానున్నాయి. వచ్చే యేడాది మాత్రం ‘బచ్చన్ పాండే’ సినిమాతో పలకరించనున్నాడు. ఇక ధనుశ్ విషయానికొస్తే.. గతేడాది ‘అసురన్’ మూవీతో సక్సెస్ అందుకున్న ఈ హీరో.. తాజాగా పటాస్ మూవీతో మరో హిట్టు అందుకున్నాడు.