హిందీ నటుడు అక్షయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తన సినిమాలతో అటు నార్త్‌తో పాటు సౌత్‌లో కూడా మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. అది అలా ఉంటే ఆయన తన ఫ్యాన్స్‌కు క్షమాపణలు చెప్పారు. వివరాల్లోకి వెళితే.. మసాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న అక్షయ్ కుమార్ సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలకు స్పందించారు.
పద్మశ్రీ తీసుకుని పోగాకు నమలమంటావా అంటూ మీమ్స్ వైరల్ అవుతున్న నేపథ్యంలో ఆ పొగాకు ఉత్పత్తులకు ఇకపై ప్రచారకర్తగా ఉండబోనని ప్రకటించారు అక్షయ్. దీనికి సంబంధించి ఆయన ఓ నోట్‌ను విడుదల చేశారు. ఇక భవిష్యత్తులో ప్రజల ప్రాణాలను హరించే ఎటువంటీ ఉత్పత్తులకు ప్రచారం చేయబోనని ప్రకటించారు. అంతేకాదు ఆ ప్రకటన ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఏదైనా మంచి పనికి ఉపయోగిస్తాను. అయితే కాంట్రాక్ట్ నిబంధనల ప్రకారం కొంతకాలం వరకు ఆ ప్రకటన ప్రసారమవుతూనే ఉంటుంది. అయితే ఇకపై అలాంటి ప్రకటనల్లో నటించనంటూ అక్షయ్ తన నోట్లో రాసారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ట్వీట్ వైరల్ అవుతోంది.
ఇక ఇప్పటికే ఈ జాబితాలో మరో ఇద్దు హిందీ నటులు షారూఖ్ ఖాన్, అజయ్ దేవగణ్ పాన్ మసాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. వీరిపై కూడా సోషల్ మీడియాలో తీవ్రంగా విమర్శలు, మీమ్స్ వస్తున్నాయి. చూడాలి మరి వారు ఎలా స్పందిస్తారో.. ఇక్కడ మరో విషయం ఏమంటే ఇలాంటీ పాన్ మసాలా యాడ్ కోసం అల్లు అర్జున్ను కూడా కొన్ని కంపెనీలు సంప్రదించాయని.. అయితే అల్లు అర్జున్ మాత్రం సున్నితంగా ఆ భారీ ఆఫర్‌ను తిరస్కరించినట్లు తెలుస్తోంది.
ఇక అక్షయ్ సినిమాల విషయానికి వస్తే.. హిందీలో అక్షయ్ కుమార్ వరుస సినిమాాలతో అదరగొడుతున్నారు. ఈ యేడాది కరోనా సెకండ్ వేవ్ తర్వాత ‘బెల్ బాటమ్’ సినిమాతో థియేటర్స్‌లో పలకరించారు. పాజిటివ్ టాక్‌తో విడుదలైన ‘బెల్ బాటమ్’ ముంబై సహా పలు ప్రాంతాల్లో థియేటర్స్ పూర్తి స్థాయిలో ఓపెన్ కానీ సందర్భంలో విడుదలైన ఈ సినిమా కేవలం రూ. 30 కోట్ల వసూళ్లనే సాధించింది. గతేడాది దీపావళి సందర్భంగా విడుదలైన ‘సూర్యవంశీ’ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటారు అక్షయ్ కుమార్.
ఈ సినిమా బాలీవుడ్ చిత్ర పరిశ్రమను ఊపిరి పీల్చుకునేలా చేసింది. ఇప్పటికే రూ.150 కోట్ల వసూళ్లు చేసిన ఈ సినిమా రూ. 200 కోట్ల దిశగా పరుగులు తీస్తోంది. ఈ సినిమా కేవలం ఓవర్సీస్లో రూ. 50 కోట్ల వరకు రాబట్టి మిగతా సినీ నిర్మాతలు ఊపిరి పీల్చుకునేలా చేసింది. ఆ తర్వాత ఈయన నటించిన ‘అతరంగీ రే’ సినిమాను డిస్నీ హాట్ స్టార్‌లో విడుదల చేశారు.
అక్షయ్ కుమార్.. హిందూస్థాన్ సింహంగా పేరు గాంచిన పృథ్వీరాజ్ చౌహాన్ జీవిత కథపై ‘పృథ్వీరాజ్’ టైటిల్‌తో చారిత్రక సినిమా చేసిన సంగతి తెలిసిందే కదా. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలైంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని చంద్రప్రకాష్ ద్వివేది డైరెక్ట్ చేసారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
[caption id="attachment_1275392" align="aligncenter" width="720"] ధర్మం కోసం బతికాను. ధర్మం కోసం చావనైనా చస్తాను అంటూ పృథ్వీరాజ్ చౌహాన్‌గా అక్షయ్ కుమార్ చెప్పిన డైలాగులు బాగున్నాయి. హిందూ ధర్మ స్థాపన కోసం పృథ్వీరాజ్ చేసిన పోరాటం ఈ సినిమాలో హైలెట్‌గా నిలవనున్నాయి. ఈ సినిమాలో ఇతర ముఖ్యపాత్రల్లో సంజయ్ దత్, సోనూసూద్ నటించారు. మరోవైపు ఈ చిత్రంలో అక్షయ్ కుమార్‌కు జోడిగా మాజీ ప్రపంచ సుందరి మానుషీ చిల్లర్ కథానాయికగా ఈ సినిమాతో పరిచయమవుతోంది.
ఈ సినిమాలో రాణి సంయోగిత పాత్రలో నటించింది. ముందుగా ఈ సినిమాను జనవరి 21న రిపబ్లిక్ డే కానుకగా విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. తాజాగా ఈ సినిమాను జూన్ 3న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. మరోవైపు అక్షయ్ కుమార్ ‘రామ్ సేతు’ అనే సినిమా చేస్తున్నారు. రామ్ సేతు’ నిజమా.. ? కల్పనా ? అంటూ ట్యాగ్ లైన్ కూడా ఉన్నాయి. ఈ సినిమాను తమిళనాడులోని ‘రామ్ సేతు’ నేపథ్యంలో చారిత్రక నేపథ్యంలో తెరకెక్కించారు.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తైయింది. కోట్లాది భారతీయుల గుండె చప్పుడైన ‘రామ్ సేతు’ పై నిర్మిస్తోన్న ఈ సినిమాపై అంచనాలున్నాయి. దాంతో పాటు ‘రక్షా బంధన్’ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉంది. రీసెంట్గా ‘ఓ మై గాడ్ 2’ సినిమాఈ చిత్రంలో అక్షయ్ కుమార్ మహా కాళేశ్వరుడి పాత్రలో కనిపించనున్నారు. దీంతో పాటు ‘ఆకాశం నీ హద్దురా’, ‘రాక్షసుడు’, ఊసరవెల్లి’, డ్రైవింగ్ లైసెన్స్ వంటి రీమేక్స్‌లో నటించడానికి ఓకే చెప్పారు అక్షయ్ కుమార్.