మనం@6 Years: అక్కినేని ఫ్యామిలీకి మరిచిపోలేని చిత్రం..

అక్కినేని నాగేశ్వరరావు ఆయన తనయుడు నాగార్జున కాంబినేషన్‌లో వచ్చిన చివరి చిత్రం ‘మనం’. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌లో నాగార్జున స్వీయ నిర్మాణంలో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్కినేని ఫ్యామిలీకి చెందిన అందరూ హీరోలు నటించడం విశేషం. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. సరిగ్గా 6 ఏళ్ల క్రితం ఈ సినిమా విడుదలై సంచలన విజయం సాధించింది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. అంతేకాదు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఓ క్లాసిక్‌గా నిలిచింది.