ANR.. అక్కినేని నాగేశ్వరరావు.. ఈయన గురించి ఏం చెప్పాలి..? నడిచే నట బాండాగారం ఈయన. 90 ఏళ్ళ తెలుగు సినిమా చరిత్రలో 75 ఏళ్ళు ఈయన సొంతం. స్వాతంత్య్రం రాకముందే తెలుగు తెరపై నాగేశ్వరరావు కీలుగుర్రం ఎక్కిన సూపర్ హీరో. ఎన్టీఆర్ కంటే ముందే స్టార్ హోదా అందుకున్న లెజెండరీ నటుడు. నాగేశ్వరరావు చేయని పాత్ర లేదు.. మెప్పించని హృదయం లేదు. చనిపోయే వరకు కూడా సినిమాలే శ్వాసగా బతికారు.
సినిమాలే ఆశగా, శ్వాసగా బతికిన అతికొద్ది మంది నటులలో నాగేశ్వరరావు కూడా ఒకరు. ఈయన మరణించిన ఐదు నెలలకు మనం సినిమా విడుదలైంది. 2014, జనవరి 22న ఏఎన్నార్ మరణించారు. నేడు ఆయన 8వ వర్ధంతి. చనిపోయే 4 నెలల ముందు ఈయనకు క్యాన్సర్ వచ్చింది. నాకు క్యాన్సర్ వచ్చింది.. అయినా కూడా బతికి చూపిస్తాను అంటూ ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించిన ధైర్యవంతుడు ఈయన.
ANR చివరి రోజుల్లో పరిస్థితి ఎలా ఉండేదో ఆయన్ని అతి సమీపంగా చూసిన వాళ్లలో ఒకడైన నటుడు కాదంబరి కిరణ్ చెప్పాడు. ఈ మధ్యే ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏఎన్నార్ మరణం గురించి కూడా మాట్లాడాడు ఈయన. ఆయన చివరి రోజుల్లో ఎవర్నీ అనుమతించే వాళ్లు కాదని.. కొన్ని నెలల పాటు ఒకే గదికి నాగేశ్వరరావు పరిమితం అయిపోయారని చెప్పాడు కిరణ్.
అంతేకాదు.. ఆ గదిలోకి కేవలం కుటుంబ సభ్యులకు తప్ప బయటికి వాళ్లకు అనుమతి ఉండేది కాదని.. కానీ నాగేశ్వరరావుతో ఉన్న అనుబంధం దృష్ట్యా తనను మాత్రం లోనికి అనుమతించేవాళ్లని చెప్పాడు కిరణ్. ఏఎన్నార్ మరికొన్ని రోజుల్లో మరణిస్తారనగా.. ఆయన శరీరం మరీ పలచగా మారిపోయిందని చెప్పాడు ఈయన. ముట్టుకుంటే చర్మం ఊడొచ్చేదంటూ సంచలన నిజలు బయటపెట్టాడు కిరణ్ కాదంబరి.
ఈ విషయాలు ఇప్పటి వరకు బయటపడలేదు. ఏఎన్నార్ చనిపోయే సమయానికి ఆయన శరీరం క్యాన్సర్ కారణంగా అలా అయిపోయిందా అంటూ షాక్ అవుతున్నారు అభిమానులు. కాదంబరి కిరణ్‌తో ఏఎన్నార్‌కు ఎప్పట్నుంచో అనుబంధం ఉండేది. ఆయనతో మట్టి మనిషి అనే సీరియల్ కూడా నిర్మించాడు కిరణ్. ఆ తర్వాత మరో సీరియల్ కూడా చేసాడు. కేవలం నాగేశ్వరరావు వల్లే తాను ఇంకా బతికున్నానని చెప్పుకొచ్చాడు కిరణ్. ఏదేమైనా కూడా ఏఎన్నార్ డెత్ సీక్రేట్స్ చెప్పి అందరికీ షాకిచ్చాడు కాదంబరి కిరణ్.