Bigg Boss: నాగార్జున షాకింగ్ డెసీషన్.. హోస్టింగ్కి గుడ్ బై చెప్పేసిన కింగ్!
Bigg Boss: నాగార్జున షాకింగ్ డెసీషన్.. హోస్టింగ్కి గుడ్ బై చెప్పేసిన కింగ్!
Akkineni Nagarjuna: తెలుగులో ఇప్పటికే ఐదు సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో.. ప్రస్తుతం ఆరో సీజన్ లో ఉంది. ఓటీటీ వేదికగా ప్రసారమవుతున్న ఈ సీజన్ కూడా ముగింపు దశకు వచ్చింది. ఈ పరిస్థితుల నడుమ నాగార్జున ఓ షాకింగ్ డెసీషన్ తీసుకున్నారని తెలుస్తుండటం హాట్ టాపిక్ అయింది.
బుల్లితెర భారీ పాపులారిటీ షో బిగ్ బాస్ ఓ పక్క సక్సెస్ ఫుల్గా రన్ అవుతూనే మరోపక్క తీవ్ర విమర్శలు ఎదుర్కుంటున్న సంగతి తెలిసిందే. ఈ రియాలిటీ షో గురించి ఒక్కొక్కరిదీ ఒక్కో వర్షన్. ఏదిఏమైనా, ఎవరేమన్నా షో మాత్రం అన్ని భాషల్లో విజయవంతంగా రన్ అవుతూనే ఉంది.
2/ 8
తెలుగులో ఇప్పటికే ఐదు సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో.. ప్రస్తుతం ఆరో సీజన్ లో ఉంది. ఓటీటీ వేదికగా ప్రసారమవుతున్న ఈ సీజన్ కూడా ముగింపు దశకు వచ్చింది. ఈ పరిస్థితుల నడుమ నాగార్జున ఓ షాకింగ్ డెసీషన్ తీసుకున్నారని తెలుస్తుండటం హాట్ టాపిక్ అయింది.
3/ 8
బిగ్ బాస్ తొలి రెండు సీజన్లు మినహాయిస్తే మూడో సీజన్ నుంచి ఈ షోకి నాగార్జుననే హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. కంటిస్టెంట్స్ ఆట ఒకెత్తయితే.. ఈ షోని నాగార్జున నడిపిస్తున్న తీరు మరో ఎత్తు అయింది.
4/ 8
ఈ నేపథ్యంలో నాగార్జునపై బోలెడన్ని విమర్శలు కూడా వచ్చాయి. బిగ్ బాస్ మాటెత్తితే చాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడే సీపీఐ నారాయణ అయితే నాగార్జునపై దారుణమైన కామెంట్లు చేశారు. ఇదొక బూతు దందా, బిగ్ బాస్ అనేది బ్రోతల్ హౌస్ అంటూ రచ్చ రచ్చ చేశారు.
5/ 8
ఇక ఇదిలా ఉంటే కొందరు కంటిస్టెంట్ల విషయంలో నాగార్జునది పక్షపాత ధోరణి అనే టాక్ కూడా బాగానే నడుస్తోంది. హౌజ్ లో కొందరిపై ఫేవరిజం చూపిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో నాగార్జున ఓ కీలక నిర్ణయం తీసుకున్నారట. ఇక హోస్టింగ్ కి బై బై చెప్పాలని ఫిక్సయ్యారట.
6/ 8
ఇక నుంచి తాను బిగ్ బాస్ షోకి హోస్టింగ్ చేయనని బిగ్ బాస్ మేనేజ్మెంట్ తో తెగేసి చెప్పారట నాగార్జున. మూడో సీజన్ నుంచి ఇప్పటివరకు వరుసగా నాగార్జుననే హోస్ట్ చేస్తున్న ఈ షోలో ఇకపై నాగ్ మాటలు వినిపించవనే టాక్ సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతోంది.
7/ 8
బిగ్ బాస్ మేనేజ్మెంట్ చేస్తున్న కొన్ని వ్యవహారాలు కూడా నాగార్జునకు పెద్దగా నచ్చడం లేదనేది ఇన్ సైడ్ టాక్. అందుకే ఎలాగోలా ఈ సీజన్ పూర్తి చేసి ఇక టాటా బై బై చెప్పాలని ఆయన డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
8/ 8
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 విషయానికొస్తే.. సెప్టెంబర్ 4న మొదలైన ఈ షో విజయవంతంగా రన్ అవుతోంది. తాజాగా 14వ వారం టైటిల్ ఫేవరేట్ గా ఆడుతూ వస్తున్న ఇనయా సుల్తానా ఎలిమినేషన్ జరిగింది. ఇది కూడా నాగార్జున అప్సెట్ కావడానికి కారణం అని చెప్పుకుంటున్నారు.