Akkineni Akhil: పెళ్లిపై అఖిల్ రియాక్షన్.. లవ్ అంటే అదేనంటూ అక్కినేని వారబ్బాయి ఓపెన్
Akkineni Akhil: పెళ్లిపై అఖిల్ రియాక్షన్.. లవ్ అంటే అదేనంటూ అక్కినేని వారబ్బాయి ఓపెన్
Akkineni Akhil Marriage: గత కొన్ని రోజులుగా అఖిల్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారనేది జనాల్లో హాట్ టాపిక్ అయింది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ సమావేశంలో ప్రేమ, పెళ్లి గురించి ఆయన రియాక్ట్ అయ్యారు.
యంగ్ హీరో అక్కినేని అఖిల్ తాజాగా తన పెళ్లి, ప్రేమ గురించి మాట్లాడారు. గత కొన్ని రోజులుగా తన పెళ్లి గురించి వైరల్ అవుతున్న వార్తలపై ఆయన రియాక్ట్ అయ్యారు. తన ఉద్దేశంలో ప్రేమ అంటే స్పోర్ట్స్ అని చెప్పారు.
2/ 8
గత ఆరేళ్ళ క్రిందట తన మాజీ ప్రియురాలు శ్రియా భూపాల్ తో అఖిల్ కు ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే అనూహ్యంగా ఆ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయింది. అప్పటి నుంచి అఖిల్ పెళ్లి మ్యాటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
3/ 8
అఖిల్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారనేది జనాల్లో హాట్ టాపిక్ అయింది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ సమావేశంలో ప్రేమ, పెళ్లి గురించి ఆయన రియాక్ట్ అయ్యారు. ఇప్పట్లో పెళ్లి చేసుకునేది లేదని చెబుతూ గత కొంతకాలంగా చక్కర్లు కొడుతున్న రూమర్లకు చెక్ పెట్టారు.
4/ 8
నా పెళ్లిపై రకరకాల రూమర్స్ వైరల్ అవుతున్నాయి. కానీ ఇప్పుడు అలాంటి ఆలోచన లేదు. ప్రస్తుతం పెళ్లి మాటలేదు. ఇంకొన్నాళ్లు సింగిల్ గానే ఉంటా అని అక్కినేని అఖిల్ చెప్పారు. తన దృష్టిలో లవ్ అనేది స్పోర్ట్స్ లాంటిదే అని చెప్పుకొచ్చారు.
5/ 8
తనకు తనకు క్రికెట్ అంటే చాలా ఇష్టమని.. అదే తనకు స్ట్రెస్ బస్టర్ అని చెప్పారు అఖిల్. 15 మందితో కూడిన ఓ టీమ్ తనకుందని, చిన్నప్పటి నుంచి ఆ బ్యాచ్ అలాగే కొనసాగుతోందని చెప్పిన అఖిల్.. కనీసం రెండు మూడు రోజులకైనా ఒకసారి అంతా కలిసి క్రికెట్ ఆడతామని అన్నారు.
6/ 8
ఇకపోతే సోషల్ మీడియా అంటే తనకు పెద్దగా అవగాహన లేదని చెప్పారు అఖిల్. పైగా తనకు సోషల్ మీడియా అంటే భయం అని కూడా అన్నారు. అందుకే పర్సనల్ పోస్టులు పెట్టనని, కేవలం వృత్తిపరమైన పోస్టులు పెడతానని తెలిపారు.
7/ 8
సినిమాల పరంగా కెరీర్ టర్నింగ్ పాయింట్ కోసం చూస్తున్న అఖిల్.. ప్రస్తుతం ‘ఏజెంట్’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్ కు సూపర్ రెస్పాన్స్ దక్కింది.
8/ 8
ఏకే ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ నటుడు మమ్ముట్టీ కీలక పాత్ర పోషిస్తున్నారు. అన్ని హంగులతో ఏప్రిల్ 28న ఈ సినిమా విడుదల కానుంది.