హీరోగా వరుస పరాజయాల్లో ఉన్న అఖిల్ అక్కినేనికి ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాతో కథానాయకుడిగా తొలి సక్సెస్‌ను అందుకున్నారు. 2021లో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలో సాప్ట్ రోల్లో కనిపించిన అఖిల్.. ఇపుడు ఏజెంట్ సినిమా కోసం పూర్తిగా ట్రాన్స్ఫామ్ అయ్యాడు. (Twitter/Photo)
అఖిల్ ఏజెంట్ సినిమాను ఏకే ఎంటర్టెన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర, సురెండర్2 సినిమా బ్యానర్ పై సురేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. స్పై థ్రిల్లర్‌గా వస్తోన్న ఈ చిత్రాన్ని భారీగా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి మరో ముఖ్యపాత్రలో నటిస్తుండంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.
ఈ ఏజెంట్ సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్ లో భారీ ట్విస్ట్ ఉంటుందని సమాచారం. అఖిల్ క్యారెక్టర్ పై రివీల్ అయ్యే ఈ ట్విస్ట్ సినిమా మొత్తానికి గుండెకాయ లాంటిది అని.. ఈ సినిమా స్క్రీన్ ప్లే కూడా చాలా డిఫరెంట్ గా ఉండబోతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో అఖిల్ తన నరాలు కూడా బలంగా ఎలివేట్ అయ్యేలా కండలు పెంచి మరీ నటిస్తున్నాడు. Photo Twitter
‘ఏజెంట్’ సినిమాకు టీజర్‌ను వివిధ భాషల్లో ఏక కాలంలో విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ టీజర్ హాలీవుడ్ రేంజ్లో ఉంది. డైరెక్టర్‌గా సురేందర్ రెడ్డి టేకింగ్ అదుర్స్ అనేలా ఉంది. పిక్చరైజైషనే కేక పుట్టిస్తోంది. అఖిల్ గెటప్ కూడా హాలీవుడ్ రేంజ్ లెవల్లో ఉంది. కొన్ని సీన్స్ ఆర్నాల్డ్ లెవల్లో ఉన్నాయి