వ్యూస్ పరంగా ఇప్పటికే పది మిలియన్స్ వ్యూస్ పొంది సంచలనం రేపుతోంది. యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఇక దీపావళి సందర్భంగా ఈ చిత్రం నుంచి విడుదలైన భం అఖండ, భంభం అఖండ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ 15 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి సీనియర్ హీరోల ట్రైలర్స్‌లో టాప్ ప్లేస్‌లో ఉంది. (Twitter/Photo)
తెలంగాణ (నైజాం) ప్రాంతం రూ. 10 కోట్లుకు అమ్మడుపోయినట్టు సమాచారం. ఇక రాయలసీమ (సీడెడ్) హక్కులు రూ .12 కోట్లకు అమ్ముడు పోయినట్టు సమాచారం. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను ద్వారక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా డిజిటల్ శాటిలైట్ హక్కులను హాట్ స్టార్, స్టార్ దక్కించుకుంది. ‘అఖండ’ సినిమా తర్వాత బాలయ్య.. గోపీచంద్ మలినేనితో తర్వాత సినిమా చేయనున్నారు.