Balakrishna - Akhanda Hindi Version : బాలయ్య ప్రస్తుతం వరుస సినిమాలను చేస్తున్నారు. ఇక ఈ సంక్రాంతికి ‘వీరసింహారెడ్డి’గా ప్రేక్షకులను అలరించారు. ఆ ఊపు మరిచిపోకముందే.. ఈయన ఈయన హీరోగా నటించిన ‘అఖండ’ చిత్రాన్ని హిందీలో నేడు భారీ ఎత్తున విడుదలైంది. ఇప్పటికే హిందీలో విడుదల చేసిన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్‌ల వచ్చింది. మరి హిందీలో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా.. ఇక ఈ సినిమాను హిందీ ఏరియాల్లో భారీ ఎత్తున విడుదల చేసారు. (Twitter/Photo)
తెలుగులో విడుదల చేసిన ట్రైలర్‌ను హిందీలో డబ్ చేసి రిలీజ్ చేసారు. బాలయ్యకు హిందీ డబ్బింగ్ వాయిస్ అంతగా సూట్ కాలేదనే అభిప్రాయం అభిమానులు, నెటిజన్స్ నుంచి వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా తెలుగులో బ్లాక్ బస్టర్ సంచలన విజయం సాధించిన ఈ చిత్రం హిందీ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. (Twitter/Photo)
బాలయ్య ’అఖండ’ విషయానికొస్తే.. ఈ డిజిటల్ యుగంలో ఈ సినిమా 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల వేడుకకు అభిమానులు వేలాదిగా తరలి వచ్చారు. ముఖ్యంగా ఈ రోజుల్లో 50 రోజులు.. 100 రోజులు.. 150 రోజులు.. 175 రోజులు.. 200 రోజులు.. ఇలాంటి పోస్టర్స్ బహుశా ఒకప్పుడు కనిపించేవి కానీ గత పదేళ్లుగా కనిపించడం లేదు. ఒకప్పుడు తమ హీరో సినిమా ఇన్ని సెంటర్స్‌లో 100 రోజులు ఆడిందంటూ గర్వంగా చెప్పుకునేవాళ్లు అభిమానులు. (Twitter/Photo)
ఈ సినిమా 50వ రోజు 103 థియేటర్స్‌లో ప్రదర్శించ బడటం ఒక రికార్డు అని చెప్పాలి. అది ఓ రికార్డు అనుకుంటే.. ఆ తర్వాత సెంచరీ పూర్తి చేసుకొని హిస్టరీ రిపీట్ చేసింది. ఈ సినిమా 20 థియేటర్స్‌లో 100 రోజుల పూర్తి చేసుకుంది. అందులో 4 కేంద్రాల్లో డైరెక్ట్‌గా 100 రోజులు ఆడింది.ఈ సినిమా 175 రోజులు పరుగును పూర్తి చేసుకుంది.
అది కూడా గుంటూరు జిల్లా చిలకలూరి పేటలోని రామకృష్ణ థియేటర్లో ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శించబడింది. ఈ డిజిటల్ యుగంలో ఒక సినిమా ఓ థియేటర్లో సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకోవడం అది.. మొత్తంగా గత పదేళ్లలో ఒక హీరో సినిమా 100 రోజులతో పాటు ఏకంగా ఒక కేంద్రంలో 175 రోజులు పూర్తి చేసుకోవడం మన దేశంలో బాలయ్యకు మాత్రమే సాధ్యమైందనే చెప్పాలి. బాలయ్య సినిమాలకు తెలంగాణ, ఏపీల కంటే సీడెడ్ (రాయలసీమ)లో తిరుగులేని ఫ్యాన్ బేస్ ఉంది.
ఇక బాలయ్య హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ‘వీరిసింహారెడ్డి’ సినిమా సంక్రాంతి హిట్‌గా నిలిచింది. ఇప్పటికే రూ. 70 కోట్ల షేర్ (రూ. 120 కోట్ల గ్రాస్) వసూళ్లతో బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది. మొత్తంగా వీరసింహారెడ్డి మూవీ రిలీజైన 8 రోజులకు హిందీలో బాలయ్య నటించిన ‘అఖండ’ హిందీ సినిమా విడుదల కావడం బాలయ్య అభిమానులు ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు. మరి అఖండతో బాలయ్య బీటౌన్‌లో సత్తా చూపెడతాడా లేదా అనేది చూడాలి. (Twitter/Photo)