నందమూరి బాలకృష్ణ తాజాగా బోయపాటి శ్రీను దర్శకత్వం చేసిన ‘అఖండ’తో భారీ విజయం సాధించింది. ఈ సినిమా సక్సెస్‌తో పాటు బాలయ్య ఆహా ఓటీటీ వేదికగా ‘అన్‌స్టాపబుల్ విత్ NBK’ ప్రోగ్రామ్‌తో అదరగొడుతున్న సంగతి తెలిసిందే కదా. ‘అఖండ’ విజయం తర్వాత బాలయ్య.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయనున్నారు. ఇప్పటికే గోపీచంద్ మలినేని ఈ చిత్రానికి సంబంధించిన కథ రెడీ చేసినట్టు సమాచారం. (Twitter/Photo)
ఇప్పటికే పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభమైంది. ఇంతలోనే బాలయ్యకు ‘అఖండ’ షూటింగ్లో గాయం కావడంతో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడం ఆలస్యమైంది. బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో త్వరలో సినిమా తెరకెక్కనుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ను మొదలు పెట్టాడు గోపీచంద్ మలినేని. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. సంక్రాంతి తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. (File/Photo)
బాలకృష్ణతో గోపీచంద్ మలినేని చేసే సినిమాలో బాలయ్య మరోసారి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర, ఫ్యాక్షనిస్ట్‌గా చూపించబోతున్నట్టు సమాచారం. పలనాడు బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమాను నిజ జీవిత గాథతో తెరకెక్కించబోతున్నాడట. అంతేకాదు ఈ సినిమాలో బాలయ్యను రెండు పాత్రలకు సంబంధించిన గెటప్స్‌కు కూడా రెడీ చేసినట్టు సమాచారం. ఈ సినిమా షూటింగ్‌ను రాయలసీమ, బార్డర్లో పిక్చరైజ్ చేయనున్నారు. ఇప్పటికే లొకేషన్స్‌ను కూడా ఫైనలైజ్ చేసినట్టు సమాచారం. (File/Photo)
దాసరి నారాయణ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘పరమవీరచక్ర’లో సమాజాన్ని రక్షించే పోలీస్ పాత్రను కాకుండా దేశాన్ని కాపాడే మిలటరీ ఆఫీసర్‌గా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. అటు మంగమ్మ గారి మనవడు సినిమాలో సైనికుడి పాత్రలో నటించిన బాలయ్య. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. (Facebook/Photo)
‘అశ్వమేథం’లో పోలీస్ ఆఫీసర్ కాకుండా ఎయిర్ ఫోర్స్ అధికారి పాత్రలో నటించడం విశేషం. కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ పతాకంపై చలసాని అశ్వనీదత్ నిర్మించిన ఈ చిత్రంలో మరో కథానాయకుడిగా శోభన్ బాబు నటించారు. ఈ సినిమాలో బాలయ్య సరసన మీనా, నగ్మా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచింది. (Youtube/Credit)