ఆరేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా ఇప్పటి వరకు ఒక్క భారీ హిట్ కూడా అందుకోలేకపోయిన ప్రగ్యా జైస్వాల్కు అఖండతో అదిరిపోయే బ్లాక్బస్టర్ వచ్చింది. బాలయ్య హీరోగా నటించిన ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకుడు. అంతకు ముందే ఈయన దర్శకత్వంలో జయ జానకీ నాయక సినిమా చేసింది ప్రగ్యా. అందులో కూడా అదిరిపోయే హాట్ షో చేసింది. అయితే ఆ సినిమా తర్వాత కూడా ఈమెకు అవకాశాలు రాలేదు.
మంచు విష్ణు, మనోజ్ లాంటి హీరోలతో సినిమాలు చేసిన తర్వాత పూర్తిగా గ్యాప్ ఇచ్చేసింది. విష్ణుతో నటించిన ఆచారి అమెరికా యాత్ర తర్వాత ఈమెను దాదాపు మరిచిపోయారు దర్శక నిర్మాతలు. ఇలాంటి సమయంలో అఖండ సినిమాలో అవకాశం దక్కించుకుంది ప్రగ్యా. ఇందులో అదిరిపోయే హాట్ షో చేసింది. అలాగే హోమ్లీగానూ కనిపించింది ఈ ముద్దుగుమ్మ.
బాలయ్య సినిమా బ్లాక్బస్టర్ కావడంతో తెలుగులో అవకాశాలు వస్తాయని వేచి చూస్తున్న ఈమెకు ఏకంగా బాలీవుడ్ నుంచి పిలుపు వచ్చింది. అక్కడ సల్మాన్ ఖాన్ నుంచి అవకాశం వచ్చింది. దాంతో గాల్లో తేలిపోయింది ప్రగ్యా జైస్వాల్. ఊహించని విధంగా సల్మాన్ ఖాన్ నుంచి ఆఫర్ రావడంతో అమ్మడు ఆనందానికి అవధుల్లేకుండా పోతున్నాయి.