నందమూరి నట సింహం బాలకృష్ణ (Balakrishna)ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ అఖండ (Akhanda). ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా, జగపతిబాబు, శ్రీకాంత్, పూర్ణ కీలక పాత్రలో నటించారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. Photo: Instagram.com/shamnakasim
భారీ అంచనాల నడుమ గతేడాది డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి వసూళ్లను రాబట్టింది. బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతున్న తీరు చూసి అంతా షాక్ అవుతున్నారు. ఈ మధ్య కాలంలో ఎన్నడూ చూడని ప్రభంజనం ఇది. ముఖ్యంగా బాలయ్య పని అయిపోయింది అనుకున్న వాళ్ళకు దిమ్మ తిరిగిపోయేలా సమాధానం ఇచ్చారు. అఖండ సినిమా 6 వారాల్లో రూ. 73 కోట్లకు పైగా షేర్ (130 కోట్ల గ్రాస్) వసూలు చేసింది. Photo: Instagram.com/shamnakasim
దీనికి తోడు ‘సింహా, లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత వస్తున్న ఈ కాంబినేషన్ అఖండ కావడంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. అందులో భాగంగా ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడు పోయాయని సమాచారం. అంతేకాదు ఈ అఖండ సినిమా బాలయ్య కెరీర్ లోనే హైయెస్ట్ ఫిగర్స్ టచ్ చెయ్యనున్నట్టుగా తెలుస్తోంది. Photo: Instagram.com/shamnakasim