అఖండ సినిమా 120 కోట్ల దిశగా అడుగులు వేస్తుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతున్న తీరుకు అంతా ఆశ్చర్యపోతున్నారు. ట్రేడ్ వర్గాలను సైతం షాక్ చేసేలా అఖండ ప్రభంజనం సాగుతుంది. ముఖ్యంగా బాలయ్య పని అయిపోయింది అనుకున్న వాళ్ళకు దిమ్మ తిరిగిపోయేలా సమాధానం ఇస్తున్నాడు ఈయన. అఖండ సినిమా 17 రోజుల్లోనే 114 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. విడుదలైన 17వ రోజు కూడా 50 లక్షల వరకు షేర్ వసూలు చేసి ఔరా అనిపించింది అఖండ.
బోయపాటి (Boyapati Sreenu) దర్శకత్వంలో ఈయన నటించిన అఖండ (Akhanda) సినిమా మూడు రోజుల కలెక్షన్స్ చూసిన తర్వాత ట్రేడ్ పండితులు మాత్రమే కాదు.. కామన్ ఆడియన్స్ కూడా షాక్ అవుతున్నారు. బాలయ్య (Balakrishna) జూలు విదిలిస్తే ఇలా ఉంటుందా బాక్సాఫీస్ దగ్గర రచ్చ ఈ స్థాయిలో ఉంటుందా అనేలా మాస్ జాతరం చూపించాడు. చాలా సంవత్సరాల తర్వాత బాలయ్య సినిమా రికార్డు ఓపెనింగ్స్ తీసుకొచ్చింది. రూలర్, ఎన్టీఆర్ మహానాయకుడు లాంటి సినిమాలు క్లోజింగ్ కలెక్షన్స్‌లో కూడా కనీసం 10 కోట్లు షేర్ తీసుకురాలేదు.
కానీ ఇప్పుడు అఖండ మాత్రం అద్భుతం చేసింది. ఈ సినిమా 17 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 65.95 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లోనే 56.00 కోట్ల వరకు షేర్ వసూలు చేసింది అఖండ. ఈ జాతర చూసిన తర్వాత అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. బాలయ్య బాక్సాఫీస్ స్టామినా తగ్గిపోయిందని కామెంట్ చేసిన వాళ్లకు అఖండ సినిమాతో దిమ్మ తిరిగిపోయే ఆన్సర్ ఇచ్చాడు బాలయ్య. ఈ సినిమా 17 రోజుల ఏరియా వైజ్ కలెక్షన్స్ ఓసారి చూద్దాం..
అఖండ సినిమాకు 53 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. 17 రోజుల్లోనే 65.95 కోట్ల షేర్ వసూలు చేసింది ఈ చిత్రం. ఇప్పటికే 13 కోట్లు లాభాలు తీసుకొచ్చింది ఈ చిత్రం. పుష్ప వచ్చిన తర్వాత కూడా తన సత్తా చూపిస్తున్నాడు బాలయ్య. విడుదలైన 17వ రోజు కూడా కొన్ని చోట్ల హౌజ్ ఫుల్ బోర్డులు కనిపించాయి.. ముఖ్యంగా నైజాం, ఓవర్సీస్లో వసూళ్లు అదిరిపోయాయి. లాభాలు కూడా భారీగానే వస్తున్నాయి. దాంతో సినిమా నిలబడిపోయింది.