ఇండస్ట్రీలో హీరోగా ఎదిగేందుకు ఆకాష్ పూరి బాగానే ప్రయత్నిస్తున్నాడు. తండ్రి పూరి జగన్నాథ్ అండ ఉన్నా కూడా స్టార్ హీరోగా ఎదగలేకపోతోన్నాడు. ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నీ కూడా డిజాస్టర్లుగా మిగిలిపోయాయి. ఈ మధ్య వచ్చిన చోర్ బజార్ సినిమాతోనైనా మాస్ హీరోగా నిలబడతాడని అందరూ ఆశించారు. కానీ ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద చతికిల పడింది. అయితే ఈ మూవీ ప్రమోషన్స్‌లో మాత్రం ఆకాష్, హీరోయిన్ గెహ్నా సిప్పి యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేశారు.
చోర్ బజార్ సినిమాను ఎంతగా ప్రమోట్ చేసినా, ఎన్ని ఇంటర్వ్యూలు చేసినా కూడా రావాల్సిన బజ్ మాత్రం రాలేదు. ఓపెనింగ్స్ కూడా సరిగ్గా రాబట్టుకోలేకపోయింది. ఇక ఈ సినిమా ఫంక్షన్లో బండ్ల గణేష్ మాట్లాడిన మాటలు మాత్రం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి. పూరి జగన్నాథ్ తన కొడుకుని గాలికొదిలేశాడన్నట్టుగా బండ్ల గణేష్ మాట్లాడాడు.
అలానే హీరోయిన్ గెహ్నా సిప్పికి ప్రశ్న ఎదురైంది. ఆకాష్, డైరెక్టర్ జీవన్ రెడ్డిలో ఎవరితో పని చేయడం బాగుందని సుమ అడిగేసింది. ఆ ప్రశ్నకు గెహనా టక్కున జీవన్ రెడ్డి అని చెప్పింది. దీంతో ఆకాష్ హర్ట్ అయి షో నుంచి వెళ్లిపోయాడు. సారీ అని గెహ్నా అంటున్నా కూడా ఆకాష్ వినలేదు. మరి ఇది నిజంగా సీరియస్‌గా జరిగిందా? లేదా టీఆర్పీ కోసం వేసిన ఎత్తుగడా? అన్నది చూడాలి.