తమిళ సూపర్ స్టార్ అజిత్ కుమార్ (Ajith Kumar) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అక్కర లేదు. మాస్ హీరోగా అభిమానులు అలరించే సినిమాలు చేస్తూ బీభత్సమైన ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ఆయన హీరోగా వస్తున్న లేటెస్ట్ సినిమా తునివు. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సంక్రాంతి బరిలో దిగుతోంది. హెచ్ వినోథ్ దర్శకత్వం వహిస్తున్నా ఈ సినిమాకు తెలుగులో ఇంట్రెస్టింగ్ పేరు ఖరారు అయ్యినట్లు తెలుస్తోంది. (Twitter/Photo)
ఇక తునివు తెలుగులో కూడా విడుదలకానుందని తెలుస్తోంది. ఈ సినిమాకు తెలుగులో తెగింపు అనే టైటిల్ ఖరారు అయ్యినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఆ సినిమాకు తెలుగులో మూడు కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగిందని టాక్ నడుస్తోంది. ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. తునివులో మంజు వారియర్ కీలక పాత్రలో నటిస్తోంది. సాలిడ్ యాక్షన్‌గా వస్తోన్న ఈ “తునివు”చిత్రాన్ని వినోద్ తెరకెక్కించారు. ఈ సినిమా తమిళ నాట భారీగా రిలీజ్ కానుండగా తెలుగులో మాత్రం పెద్దగా బజ్ లేదు.. (Twitter/Photo)
ఇక గతంలో అజిత్ “వలిమై” చిత్రాన్ని తెలుగులో “బలం” అని మొదట ప్రకటించారు. కానీ తెలుగులో మళ్ళీ అదే తమిళ పేరుతో వలిమై అని రిలీజ్ చేశారు. ఈ సినిమాను జీ స్టూడియోస్ సంస్థ, బేవ్యూ ప్రాజెక్ట్స్ పతాకంపై బోనీకపూర్ సంయుక్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రానికి యువన్ శంకర్‌రాజా సంగీతం అందించారు. ఈ సినిమాలో అజిత్‌కు జోడీగా హిందీ భామ హ్యుమా ఖురేషి నటించారు. Photo : Twitter
ఇక అజిత్ పర్సనల్ విషయాల గురించి వస్తే.. ఆయన ప్రముఖ నటి షాలినిని 2000వ సంవత్సరంలో పెళ్ళి చేసుకున్నారు. అజిత్ బహుభాషాకోవిదుడు. ఆయన తెలుగు, తమిళం, కన్నడ, మళయాలం, ఇంగ్లీష్ భాషలను అనర్గళంగా మాట్లాడగలరు. అందరి హీరోల్లా కాకుండా.. జుట్టు మొత్తం తెల్లబడినా.. ఏమాత్రం రంగు వేసుకోకుండా అలాగే హీరో పాత్రలు పోషిస్తున్నారు అజిత్. Photo : Twitter
అంతేకాదు దేశంలో అత్యుత్తమ డ్రైవర్లలో అజిత్ కూడా ఒకరు అంటారు. అజిత్ నటుడుగా మారక ముందు బైకు మెకానిక్ గా తన జీవితాన్ని ఆరంభించారు. ఆ తర్వాత కొన్ని రోజులు గార్మెంట్స్ ఫ్యాక్టరీని నడిపారు. కొన్ని యాడ్స్‌లో కూడా నటించిన అజిత్ ఆ తర్వాత సినిమాల్లో అవకాశం వచ్చి పూర్తి స్థాయి నటుడిగా మారారు. Photo : Twitter
ఇక్కడ విశేషమేమంటే అజిత్ కుమార్ ఇక్కడ సికింద్రాబాద్‌లోనే జన్మించారు. దీంతో తనకు వీలు దొరికినప్పుడల్లా హైదరాబాద్‌కు వచ్చి వెళ్తుంటారు అజీత్. ఇక తెలుగులో కొన్ని సినిమాల్లో నటించిన పెద్దగా పేరు రాలేదు. కానీ అక్కడ తమిళ నాడులో సూపర్ పాపులర్ అయ్యారు అజిత్. తమిళ్లో అజిత్ ఎన్ వీడు ఎవ్ కనావర్ అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. Photo : Twitter
ఇక ఆ తర్వాత కాదల్ కొట్టై, కాదల్ వారువాల,కాదల్ మన్నన్ వంటిసినిమాల్లో నటించి చాలా పాపులర్ అయ్యారు. కెరీర్ తొలినాళ్లలో అజిత్ ఎన్నో ప్రేమకథా చిత్రాలతో నటించారు. ఆయన నటించిన ప్రేమలేఖ తెలుగులోకి డబ్ అయ్యి.. చాలా పెద్ద హిట్ అయింది. ఇక యస్ జే సూర్య దర్శకత్వంలో 1999లో వచ్చిన వాలితో మరింత పాపులర్ అయ్యారు. Photo : Twitter