ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ప్రజలను భయ భ్రాంతులకు గురి చేస్తోంది. ఇప్పటికే కరోనా బారిన పడి ఎంతో మంది తనువు చాలించారు. అందులో సినీ, రాజకీయ ప్రముఖులున్నారు. ఇప్పటికే తమిళ హీరోలు కార్తి, సూర్య తమ తండ్రి శివ కుమార్‌తో కలిసి కోవిడ్ బాధితుల కోసం తమిళనాడు ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. కోటి విరాళం చెక్‌ను అందజేసారు. తాజాగా తమిళ స్టార్ హీరో అజిత్ తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 25 లక్షల విరాళం అందజేసారు. అటు దర్శకుడు ఏ.ఆర్.మురుగదాస్.. రూ. 25 లక్షలు, రజినీకాంత్ కూతురు తన భర్త, మామతో కలిసి రూ. కోటి విరాళం సీఎం సహాయనిధికి అందజేసారు. (Twitter/Photos)