Ajay Devgn - Drishyam 2 | అజయ్ దేవ్‌గణ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘దృశ్యం 2’. మలయాళంలో హిట్టైన దృశ్యం’ సినిమాకు సీక్వెల్‌కు ఈ సినిమా తెరకెక్కింది. మలయాళంలో తెలుగులో దృశ్యం 2 ఓటీటీ వేదికగా విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. కానీ అజయ్ దేవ్‌గణ్ నటించిన ‘దృశ్యం 2’ మూవీ థియేట్రికల్‌గా విడుదలై ఇపుడు సంచలన విజయం దిశగా దూసుకుపోతుంది. ఇప్పటికే రూ. 150 కోట్లు కొల్లగొట్టిన ఈ మూవీ.. రూ. 200 కోట్ల క్లబ్బు దిశగా దూసుకుపోతుంది. (Twitter/Photo)
దృశ్యం 2 మొదటి రోజు నుంచే మంచి వసూళ్లతో దూసుకుపోతుంది. ఈ సినిమా రెండో రోజు రూ. 21.59 కోట్లు వసూళ్లను సాధిస్తే.. మూడు రోజు రూ. 27.17 కోట్లు వసూళ్లు చేసి ఫస్ట్ వీకెండ్లోనే రూ. 63 కోట్లకు పైగా నెట్ వసూళ్లను సాధించింది. ఆతర్వాత వరుసగా ఈ సినిమా సోమవారం రూ. 11.87 కోట్లు.. మంగళ వారం రూ. 10.48 కోట్లు.. బుధవారం రూ. 9.55 కోట్లు.. గురువారం రూ. 8.62 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. (Twitter/Photo)
మొత్తంగా కథ, కథనం బాగుంటే.. బాక్సాఫీస్ దగ్గర వసూళ్లను సాధించడం పెద్ద విషయం కాదనేది దృశ్యం 2 సక్సెస్‌తో మరోసారి ప్రూవ్ అయింది. మొత్తంగా దృశ్యం సినిమాలాగే ఈ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన దృశ్యం 2 కూడా యూనివర్సల్ కాన్సెప్ట్‌తో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించిందనే చెప్పాలి. మొత్తంగా దృశ్యం 2 సక్సెస్‌తో బాలీవుడ్ మరోసారి ఊపిరి పీల్చుకుంది. (Twitter/Photo)
మొత్తంగా ఈ యేడాది బాలీవుడ్లో ‘గంగూబాయ్ కఠియావాడి, ఆర్ఆర్ఆర్, వంటి సక్సెస్ తర్వాత తాజాగా దృశ్యం 2 సక్సెస్‌తో అజయ్ దేవ్‌గణ్ 2022లో మూడో విజయం అందుకున్నారు. గంగూబాయ్, ఆర్ఆర్ఆర్లో ఈయన అతిథి పాత్రల్లో మెరిసారు. హీరోగా మాత్రం దృశ్యం 2 సక్సెస్‌ను అందుకున్నారు. ఈ యేడాది అజయ్ దేవ్‌గణ్ నటించిన ‘రన్‌వే 34’, థాంక్స్ గాడ్’ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచాయి. మొత్తంగా ఐదు చిత్రాల్లో మూడు చిత్రాలు సక్సెస్ కావడం హీరోగా అజయ్ దేవ్‌గణ్ కలిసొచ్చే విషయం అనే చెప్పాలి. (Twitter/Photo)
మరోవైపు అజయ్ దేవ్‌గణ్.. రణ్వీర్ సింగ్ హీరోగా నటిస్తోన్న ‘సర్కస్’లో అతిథి పాత్రలో మెరవనున్నారు. మరోవైపు ఈయన హీరోగా నటించిన మైదాన్ వచ్చే యేడాది విడుదల కానుంది. ఇంకోవైపు ఈయన హీరోగా తమిళంలో హిట్టైన ‘ఖైదీ’ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఇక బాలీవుడ్లో ఈ సినిమాను కమర్షియల్ హంగులతో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో అజయ్ దేవ్‌గణ్ సరసన మరోసారి టబు హీరోయిన్గా నటిస్తోంది. అజయ్ దేవ్‌గణ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రానికి ‘భోళా’ అనే టైటిల్ ఖరారు చేశారు. (Twitter/Photo)
ఈ సినిమాను వచ్చే యేడాది 30 మార్చి 2023లో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాపై బాలీవుడ్లో భారీ అంచనాలే ఉన్నాయి. రన్‌వే 34 తర్వాత అజయ్ దేవ్‌గణ్ డైరెక్ట్ చేస్తోన్న చిత్రం. మరోవైపు ఈయన చారిత్రక చిత్రం ‘చాణక్య’లో టైటిల్ పాత్రలో నటిస్తున్నారు. ఇందులో చంద్రగుప్త మౌర్యుని పాత్రలో కూడా కనిపించనున్నట్టు సమాచారం. (Twitter/Photo)
మొత్తంగా అజయ్ దేవ్‌గణ్‌కు ‘దృశ్యం 2’ సక్సెస్‌ను ఈయనతో పాటు బాలీవుడ్‌కు పెద్ద రిలీఫ్ ఇచ్చిందనే చెప్పాలి. ఈ సినిమా సక్సెస్‌తో రాబోయే హిందీ చిత్రాలకు పెద్ద ఆసరా ఇచ్చినట్టైందనే చెప్పాలి. మొత్తంగా కేజీఎఫ్ 2, ఆర్ఆర్ఆర్, కాంతారా, కార్తికేయ 2 వంటి డబ్బింగ్ చిత్రాలు బాలీవుడ్లో రాజ్యమేలుతున్న ఈ సమయంలో దృశ్యం 2 సినిమా సక్సెస్ బాలీవుడ్ నటీనటులకు బిగ్ రిలీఫ్ ఇచ్చిందనే చెప్పాలి. (Twitter/Photo)
దృశ్యంలో ఈ ఇద్దరు నటులు భార్యాభర్తలుగా నటించారు. నిషికాంత్ కామత్ దృశ్యం ఒక ఎమోషనల్ థ్రిల్లర్, ఇది ఒక కేబుల్ ఆపరేటర్ విజయ్ సల్గాంకర్ (అజయ్) కథతో వ్యవహరిస్తుంది, అతని జీవితం ,సినిమా ,అతని కుటుంబం చుట్టూ తిరుగుతుంది; భార్య నందిని (శ్రియా శరణ్) కుమార్తెలు అంజు , అను. ఈ చిత్రంలో టబు ఐజీ మీరా దేశ్‌ముఖ్ పాత్రను పోషించారు. (Twitter/Photo)