ఐశ్వర్య రాజేష్.. ఈ రోజు ఈ పేరు అందరికీ తెలుసు కానీ అలా అందరికీ తెలిసేలా చేయడానికి ఐశ్వర్య పడిన కష్టాలు మాటల్లో చెప్పడం సాధ్యం కాదు. జనవరి 10న ఈమె పుట్టిన రోజు. 1990లో ఈమె జన్మించింది. జీవితంలో చాలా చిన్న వయసులోనే ఎన్నో కష్టాలు అనుభవించింది ఐశ్వర్య రాజేష్. సినిమా వాళ్ల జీవితాలు పైకి చాలా అందంగా అద్దాల మేడలా కనిపిస్తాయి కానీ లోపల మాత్రం చాలా అతుకులు ఉంటాయి. ఒక్క రాయి తగిలితే పగిలిపోయే జీవితాలు వాళ్లవి. (Instagram/Photo)
ముఖ్యంగా హీరోయిన్లు అయితే మరీ దారుణం. ఐశ్వర్య రాజేష్ లైఫ్ కూడా అంతే. ఇప్పుడంటే స్టార్ హీరోయిన్ అంటున్నారు కానీ ఈమెకు ఒకప్పుడు ఉన్న కష్టాలు తెలిస్తే కన్నీరు ఆగవు. ఐశ్వర్యకు ఇప్పుడు ప్రత్యేకంగా తెలుగులో పరిచయాలు అవసరం లేదు. పేరుకు తమిళ హీరోయిన్ అయినా కూడా ఈమె అచ్చ తెలుగమ్మాయి. ఈమె తండ్రి రాజేష్ తెలుగులో ఒకప్పుడు మంచి నటుడు. జంధ్యాల తెరకెక్కించిన సినిమాల్లో హీరోగా నటించాడు. (Instagram/Photo)
తెలుగులో ఈయన దాదాపు 54 సినిమాలు చేసాడు. దాంతో పాటు మంచి ఇమేజ్.. ఫ్యూచర్ స్టార్ అవుతాడనుకునే తరుణంలో కేవలం 38 ఏళ్ల వయసులోనే ఆయన చనిపోయాడు. తాగుడుకు బానిసై ఆయన చనిపోవడంతో ఆయన కుటుంబం దిక్కుమొక్కు లేకుండా అయిపోయింది. దాంతో ఐశ్వర్య రాజేష్ తన ముగ్గురు పిల్లలతో చాలా కష్టాలు పడింది. ఇద్దరు కొడుకులు, కూతురు ఐశ్వర్యను పెంచడానికి చాలా తంటాలు పడింది.(Instagram/Photo)
డబ్బులు బాగా ఉన్నపుడు రాజేష్ చుట్టూ చేరిన కొందరు ఆయన దగ్గర్నుంచి అన్నీ తీసుకున్నారు. సేవ పేరుతో ఉన్న డబ్బును ఈయన కూడా పోగొట్టేసాడు. చాలా మందికి ష్యూరిటీ ఇచ్చి ఉన్నదంతా ఊడ్చేసాడు. అదే తరుణంలో ఆయన తాగుడుకు బానిసై లివర్ పాడైపోవడంతో ఉన్న డబ్బులు కూడా ఖర్చు చేసి ఆయన్ని బతికించుకునే ప్రయత్నం చేసింది రాజేష్ భార్య. కానీ కుదర్లేదు.. రాజేష్ చనిపోయిన తర్వాత అప్పులోల్లు వచ్చి ఇంటిమీద పడితే చివరికి టి నగర్లో ఉన్న ఒక్క ప్లాట్ కూడా అమ్మేసి వాళ్ల అప్పులన్నీ తీర్చేసింది ఆమె. (Instagram/Photo)
తర్వాత ముగ్గురు పిల్లలతో అద్దె ఇంట్లో ఉండి చాలా కష్టాలు పడింది. ఎలాగోలా పెద్దబ్బాయి ఉద్యోగం చేస్తున్నాడు అనుకునే సమయంలో యాక్సిడెంట్లో ఇద్దరు అబ్బాయిలు ఒకేసారి చనిపోయారు. దాంతో ఐశ్వర్య రాజేష్ ఒకేసారి ఇద్దరు అన్నయ్యలను కోల్పోయింది. ఆ తర్వాత కుటుంబాన్ని పోషించే బాధ్యత తీసుకుంది. ఆ సమయంలో సన్ టీవీలో అస్తోపోవధ్ యారు అనే కామెడీ షోలో ఆమె యాంకర్‌గా తన కెరీర్ మొదలు పెట్టింది. (Instagram/Photo)
మనాడా మయిలాడ అనే రియాలిటీ షో గెలుచుకున్న తర్వాత ఆమెకు 2011లో అవగాళమ్ ఇవర్గలం సినిమాలో ఫ్రెండ్ పాత్ర వచ్చింది. ఆ తర్వాత అట్టాకత్తి సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. అక్కడ్నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు ఐశ్వర్య రాజేష్. ఎన్నో కష్టాలు పడిన తర్వాత ఇప్పుడు ఈమె ఈ స్టార్ ఇమేజ్ అనుభవిస్తుంది. దీని వెనక ఎన్నో ఏళ్ల కన్నీళ్లు కూడా ఉన్నాయి. (Instagram/Photo)
మొత్తానికి ఈమె పడిన కష్టాలు తెలిసి కన్నీరు పెట్టుకుంటున్నారు ఆమె అభిమానులు. అన్నట్లు ఐశ్వర్య రాజేష్ తాత అమర్నాథ్ కూడా పెద్ద నటుడు. ఆయన తెలుగు, తమిళంలో వందల సినిమాలు చేసాడు. ఈమె మేనత్త శ్రీలక్షి తెలుగులో 500 సినిమాలకు పైగానే నటించింది. బాబు చిట్టి అనే కామెడీతో ఈమె బాగా పరిచయం. (Instagram/Photo)