Aishwarya - Abhishek: మాల్దీవుల్లో ఐశ్వర్య - అభిషేక్ జంట.. వాళ్లు బస చేస్తున్న రిసార్ట్ ఒక నైట్ రెంట్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
Aishwarya - Abhishek: మాల్దీవుల్లో ఐశ్వర్య - అభిషేక్ జంట.. వాళ్లు బస చేస్తున్న రిసార్ట్ ఒక నైట్ రెంట్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
Aishwarya Abhishek: బాలీవుడ్ తారలు ఐశ్వర్య రాయ్ - అభిషేక్ బచ్చన్ జంట ప్రస్తుతం మాల్దీవుల్లో ఉన్నారు. ఆ జంట బస చేస్తున్న రిసార్ట్ ఒక నైట్ రెంట్ ఎంతో తెలిస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు.
1/ 7
ఐశ్వర్యరాయ్ - అభిషేక్ బచ్చన్ల కుమార్తె ఆరాధ్య తన 10వ పుట్టిన రోజును జరుపుకుంటుంది. ఈ వేడుకల కోసం బాలీవుడ్ స్టార్ ఫ్యామిలీ ప్రస్తుతం మాల్దీవులకు వెళ్లారు.
2/ 7
మాల్దీవుల్లోని ప్రముఖ లగ్జరీ రిసార్ట్ అమీలాలో ఈ కుటుంబం బస చేస్తున్నది. దీనికి సంబంధించిన ఫొటోలను ఐశ్వర్య దంపతులు సోషల్ మీడియాలోపెట్టారు. వెంటనే ఫ్యాన్స్ ఆ రిసార్ట్ గురించి గూగుల్‌లో వెతకడం ప్రారంభించారు.
3/ 7
రిసార్ట్‌లో విభిన్న సౌకర్యాలతో కూడిన విల్లాలు ఉన్నాయి. రీఫ్ వాటర్ పూల్ విల్లా, సన్‌సెట్ వాటర్ పూల్ విల్లా, లగూన్ వాటర్ పూల్ విల్లా మరియు మల్టీ బెడ్రూమ్ రెసిడెన్స్‌లు ఇక్కడ ఉన్నాయి.
4/ 7
ప్రతి విల్లాకు దాని స్వంత స్విమ్మింగ్ పూల్, సీ వ్యూ సౌకర్యం ఉంది. ఈ బాలీవుడ్ దంపతులు వారి కూతురుతోకలసి ఏ విల్లాలో నివసిస్తున్నారో స్పష్టంగా తెలియ లేదు. ఏది ఏమైనా స్టార్లు బస చేసిన రిసార్ట్‌లో ఒక్కరోజు గడిపేందుకు ఎంత ఖర్చవుతుందోనని అభిమానులు ఆరా తీస్తున్నారు.
5/ 7
ఒక జాతీయ దినపత్రిక కథనం మేరకు ఈ రిసార్ట్‌లోని అతి తక్కువ విల్లాలో ఒక రాత్రికి అద్దె రూ.76,000. విల్లా గరిష్ట అద్దె రూ.10 లక్షలు. ఇక్కడ 20 మంది వరకు ఉండగలరు.
6/ 7
బహుళ-పడక గదుల నివాసాలకు అత్యధిక రేట్లు ఉన్నాయి. రిసార్ట్ నాలుగు నుండి ఎనిమిది పడకగదుల నివాసాలను అందిస్తుంది. ఇందులో ఆరు పడక గదుల నివాసం అద్దె రూ.14 లక్షలు.
7/ 7
ఐశ్వర్య మరియు అభిషేక్ ఆదివారం రిసార్ట్‌లోని చిత్రాలను పంచుకున్నారు. మాల్దీవులు జంటలకు ప్రసిద్ధ విహారయాత్ర. ఈ నెల ప్రారంభంలో ఐశ్వర్య పుట్టినరోజు వేడుక కూడా జరిగింది.