ఇటీవలే వీర సింహా రెడ్డి సినిమాతో భారీ విజయం ఖాతాలో వేసుకున్న బాలయ్య బాబు.. అదే జోష్ లో తన తదుపరి సినిమాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే డైరెక్టర్ అనిల్ రావిపూడితో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఎప్పటికప్పుడు బయటకొస్తున్న విషయాలు నందమూరి అభిమానుల్లో ఉన్న క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి.